రూ.15వేలలో అద్భుతమైన ఫీచర్స్ గల టాప్ – 5 మొబైల్స్

0

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ యొక్క వినియోగం ఎంతలా పెరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ కాలంలో విద్యార్దుల నుండి ఉద్యోగుల వరకు మొబైల్ అవసరం చాలా పెరిగింది అని చెప్పుకోవాలి. విద్యార్దులకు ఆన్ లైన్ కోసం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇలా వారి వారి అవసరాల కోసం మొబైల్ కొనాలని చూస్తున్నారు. ఏది కొనుగోలు చేసినా స్మార్ట్ ఫోన్ ను మాత్రం తొందరపడి కొనకూడదు. ఎందుకంటే రోజుకో మోడల్ మార్కెట్లోకి వచ్చేసి ఊరిస్తాయి. అయితే, ప్రస్తుతం రూ.15000లోపు అందుబాటులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్, మంచి డిస్ప్లే, పెద్ద బ్యాటరీలు, శక్తివంతమైన ప్రాసెసర్లు గల టాప్ – 5 మొబైల్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

POCO M3 128GB: రూ.15వేల లోపు అందుబాటులో ఉన్న అత్యుత్తమ మొబైల్స్ లో పోకో ఎం3 128జీబీ మోడల్ ఒకటి. ఈ సరికొత్త పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999(6GB+64GB)లు. ఇందులో 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజి సామర్థ్యం గల మొబైల్ ధర రూ.11,999లతో కొనుగోలు చేసుకోవాలి. ఈ సరికొత్త ఎం3 సిరీస్ పవర్ బ్లాక్, పోకో యెల్లో, కూల్ బ్లూ లాంటి కలర్స్ లో లభ్యమవుతుంది.

 • పోకో ఎం3 ఫీచర్లు:
 • 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే(1080×2340)
 • ఆక్టా కోర్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 662 ప్రోసెసర్
 • 8ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 48 + 2 + 2 ఎంపీ రియర్‌ కెమెరా
 • 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
 • 512 జీబీ మైక్రో ఎస్డీ కార్డు సపోర్ట్
 • 6,000 ఎంఏహె
 • చ్ బ్యాటరీ సామర్థ్యం
 • 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్
 • ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టం
 • 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ ధర రూ.11,999

Realme 7 64GB: రియల్ మీ రూ.15 వేలలో తీసుకొచ్చిన రియల్ మీ 7 బెస్ట్ ఫోన్లలో ఇది ఒకటి. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

 • రియల్ మీ 7 ఫీచర్లు:
 • 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్‌ప్లే
 • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్
 • 16ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 64 + 8 + 2 + 2 ఎంపీ రియర్‌ కెమెరా
 • 6జీబీ/8జీబీ ర్యామ్,
 • 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
 • 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్
 • ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టం
 • 6 జీబీ + 64 జీబీ ధర రూ.14,999

Redmi Note 9 Pro 128GB: రెడ్ మీ నోట్ 9 ప్రో తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్ల అందిస్తుంది షియోమీ. ఇందులో నావిక్ టెక్నాలజీని సపోర్ట్ చేసే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్, 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఇప్పుడు ఆఫర్ కింద రూ.13,999కే అందిస్తుంది.

 • రెడ్ మీ నోట్ 9 ప్రో ఫీచర్లు:
 • 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
 • ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్
 • 48 + 8 + 5 + 2 ఎంపీ రియర్‌ కెమెరా
 • 16ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
 • 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
 • 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్
 • ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టం
 • 4 జీబీ + 128 జీబీ ధర రూ.13,999

Samsung Galaxy M21 128GB: శాంసంగ్ తన గెలాక్సీ ఎం-సిరీస్ లో రూ.15 వేలలో తీసుకొచ్చిన మొబైల్ లలో గెలాక్సీ ఎం21 స్మార్ట్ ఫోన్ చాలా ఉత్తమమైనది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

 • శాంసంగ్ గెలాక్సీ ఎం21 ఫీచర్లు:
 • 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
 • ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్
 • 48 + 8 + 5 ఎంపీ రియర్‌ కెమెరా
 • 20ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
 • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
 • 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్
 • ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టం
 • 6 జీబీ ర్యామ్, 128 జీబీ ధర రూ.14,999

Realme Narzo 20 Pro 64GB: రియల్ మీ నార్జో 20 సిరీస్‌ పేరుతో ఇటీవలే మూడు ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 65W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 • రియల్ మీ నార్జో 20ప్రో ఫీచర్లు:
 • 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే
 • మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌
 • 48 + 8 + 2 + 2 ఎంపీ రియర్‌ కెమెరా
 • 16ఎంపీ సెల్ఫీ కెమెరా
 • 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
 • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
 • 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్
 • ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టం
 • 6 జీబీ ర్యామ్, 64 జీబీ ధర రూ.14,999

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here