కరోనా: మార్కెట్లో ఉన్న మంచి పల్స్ ఆక్సీమీటర్లు

0

గత ఏడాది కరోనా వ్యాప్తితో పోలిస్తే ఈ ఏడాది కరోనా వేగంగా విస్తరించడమే కాకుండా మరణాలు కూడా ఎక్కువ పెరిగాయి. మరణాలకు ప్రధాన కారణం సరైన సమయానికి ఆక్సిజన్ అందక పోవడమే, అలాగే మన శరీరంలో ఆక్సిజన్ ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోకపోవడం కూడా ఒక కారణమే. అందుకే, ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉండాల్సిన వాటిలో Pulse Oximeter(పల్స్ ఆక్సీమీటర్లు) కీలకమైంది. ఇది చర్మం ద్వారా ఒక కాంతి కిరణాన్ని శరీరంలోకి పంపిస్తుంది. అలా పంపించిన కాంతిని బ్లడ్ టిష్యూలు గ్రహించే సమయంలో జరిగే మార్పులను బట్టి రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అన్నది అంచనా వేస్తుంది.

సాధారణంగా వ్యక్తులకు అయితే రక్తంలో ఆక్సిజెన్ శాచురేషన్ స్థాయి 95 శాతం వరకూ ఉండవచ్చు. ఒకవేల శరీరంలో 92 శాతం కంటే తగ్గితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా భావించి, వెంటనే వైద్యులను సంప్రదించాలి. వృద్దులకు, ఉపరితిత్తుల సమస్యలకు ఇది భాగ ఉపయోగపడుతుంది. అందుకే. మెరుగైన ఫలితాలు అందించే కొన్ని ఉత్తమమైన Pulse Oximetersల జాబితాను మీ ముందుకు తీసుకొచ్చాను.

1. Dr. Trust Professional oximeter

ఈ ఆక్సీమీటర్ బాక్స్‌లో రెండు AAA బ్యాటరీలు అందిస్తారు. అలాగే దీన్ని సురక్షితంగా ఉంచడానికి పౌచ్, యూజర్ మేన్యువల్ లభిస్తాయి. దీని ధర మార్కెట్లో రూ.2,499. ఇందులో ఉండే సెన్సార్లు కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి. అలాగే ఇందులో ఎక్కువ కాలం పనిచేసే బ్యాటరీ, సౌండ్ అలారమ్ ఉంది. ఇది తక్కువ బరువు కలిగి ఉండటమే కాకుండా IP22 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది. బ్రైట్‌గా ఉండే, పెద్ద OLED డిస్‌ప్లే ఉంటుంది. Dr. Trust అనేది అమెరికాకు చెందిన ప్రముఖ మెడికల్ డివైజ్ ఉత్పత్తి కంపెనీ. ఈ సంస్థకి మన దేశంతో పాటు ప్రపంచంలో అనేక చోట్ల ఉత్పత్తి కర్మగారాలు ఉన్నాయి.

Dr. Trust Professional పల్స్ ఆక్సీమీటర్ హై-క్వాలిటీ ప్లాస్టిక్‌తో, అన్ని రకాలుగా మెరుగైన ఫిట్, ఫినిషింగ్‌ని కలిగి ఉంది. 55 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ పల్స్ ఆక్సీమీటర్, మార్కెట్లో ఉన్న ఇతర మోడల్స్ కంటే చాలా తేలికగా ఉంటుంది. వేలు పెట్టే ప్రదేశం పెద్దగా ఉండడం వల్ల చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అందరూ సౌకర్యం వంతంగా దీన్ని వాడుకోవచ్చు. IP22 సర్టిఫైడ్ ఆక్సీ‌మీటర్ కావడం వల్ల కొద్దిపాటి నీటి చుక్కలు పడ్డా, డస్ట్ పడ్డా లోపల ఉండే సర్క్యూటరీకి ఎలాంటి ప్రమాదం ఉండదు.

2. Hesley Pulse Oximeter 

Hesley Pulse Oximeter ఏబిఎస్ ప్లాస్టిక్‌తో ఇది రూపొందించబడి ఉంటుంది. వేలిని పెట్టే ప్రదేశం మెడికల్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేశారు. బ్లాక్, బ్లూ కలర్ కాంబినేషన్ వాడడం వల్ల ఇతర పల్స్ ఆక్సీమీటర్ల కంటే ఇది కొంచెం ప్రత్యేకంగా కన్పిస్తుంది. ఆక్సిజెన్ శాతాన్ని కచ్చితంగా చూపించేలా ఇండస్ట్రీ ప్రమాణాలతో కూడిన సెన్సార్లు దీనిలో ఉన్నాయి. దీనిలో బ్లడ్ ఆక్సిజెన్ స్థాయి మాత్రమే కాకుండా, రియల్-టైమ్ హార్ట్ రేట్, perfusion index కూడా చూపిస్తుంది. దీని ధర మార్కెట్లో రూ.2,399. Hesley అనేది వేయింగ్ స్కేల్స్, మసాజర్లని తయారు చేసే ప్రముఖ హెల్త్‌కేర్, పర్సనల్ కేర్ కంపెనీ.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here