Flipkart: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌…!

0
Flipkart Diwali Sale

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళీ సేల్‌ను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ బిగ్‌ దీవాళీ సేల్‌ అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డిబెట్‌ కార్డు ఉన్న వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ సందర్భంగా పలు ఉత్పత్తులను ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ చేస్తుంది. బిగ్ దీపావళి డేస్ సేల్ సందర్భంగా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌ వినియోగదారులకు రియల్‌ మీ సీ11, రియల్‌మీ సీ21వై, శాంసంగ్‌ ఎఫ్‌12, పోకో జీ3 ఎఫ్‌టీ, రియల్‌మీ నార్జో 50ఏ, మోటోరోలా జీ60, ఒప్పో రోనో 6 5జీ వంటి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై మరింత తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. డెస్క్‌టాప్‌ల కొనుగోలుపై 30 శాతం వరకు, పవర్ బ్యాంక్‌లపై 75 శాతం వరకు, హెడ్‌ఫోన్‌, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇక గృహోపకరణాల విషయానికి వస్తే.. టీవీలపై 75 శాతం వరకు, మైక్రోవేవ్ ఓవెన్‌లపై 45 శాతం వరకు తగ్గింపు , ఎయిర్ కండీషనర్‌లపై 55 శాతం వరకు తగ్గింపు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here