Zero Balance Savings Account: బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం తీసుకునే అవకాశం ఉంది. కానీ.. మన అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అయితే..? అత్యవసరంగా డబ్బులు అవసరమైతే..? స్నేహితులు, తెలిసిన వాళ్ల దగ్గర వడ్డీకి తీసుకుంటాం. మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖాతాలో డబ్బులు లేకపోయినా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు అని మీకు తెలుసా?. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి?
Overdraft Facility Details in Telugu: ఖాతాలో డబ్బులు లేకపోయినా నగదు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులు కల్పిస్తున్న సౌకర్యం పేరు ఓవర్ డ్రాఫ్ట్(OD). మనలో చాలా మందికి దీని గురించి తెలియదు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ(Overdraft Facility) అనేది ఒక షార్ట్ టర్మ్ లోన్. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. బ్యాంకులు కరెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit) అకౌంట్లకు కూడా ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
ఓవర్‌డ్రాఫ్ట్ ఎలా పొందాలి?
ఓవర్ డ్రాఫ్ట్ గురించి మీ బ్యాంకు నుంచి ఈ సమాచారం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓడీకి దరఖాస్తు చేసుకోవాలంటే.. లోన్‌కు ఎలాగైతే అప్లై చేసుకుంటామో.. ఓడీకి సైతం అదే విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా డబ్బులు పొందిన తర్వాత.. గడువులోగా వడ్డీతో సహా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
Timeకి చెల్లింపులు చేయాల్సిందే:
అనవసరమైన ఖర్చుల కోసం ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీని వినియోగించకపోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఛార్జీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.
(ఇది కూడా చదవండి: No-Cost EMI: నో కాస్ట్ ఈఎంఐతో లాభమా? నష్టమా?)
మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకున్న నగదును ఇన్‌టైమ్‌లో తిరిగి చెల్లించేలా చూసుకోండి. ఒకవేళ సమయానికి చెల్లించకపోతే.. బ్యాంకులు భారీగా వడ్డీ వసూలు చేస్తాయని మరిచిపోకండి. పైగా.. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అందుకే టైమ్‌కి తప్పక చెల్లించాలి.
ఓవర్‌డ్రాఫ్ట్ వల్ల ఉపయోగాలు:
ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే మంచిది. క్లిష్ట సమయాలలో ఖాతాదారులను ఆదుకునే ఒక మంచి సదుపాయం. ముఖ్యంగా.. బిజినెస్ చేస్తున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ.. ఏదైనా తేడా వస్తేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల.. అత్యవసరమైతేనే వినియోగించుకోవాలి.