Overdraft (OD) Facility Benefits in Telugu: మనకు అప్పుడప్పుడు కొన్ని క్లిష్ట సమయాలలో డబ్బు అత్యవసరం అవుతుంది. అలాంటి సమయాలలో డబ్బు అప్పుగా దొరకడం కూడా కష్టం అవుతుంది. ముఖ్యంగా వ్యక్తులు, వ్యాపారస్తులు, సంస్థలకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావొచ్చు. అయితే, ఇలాంటి క్లిష్ట సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం గనుక ఉంటే తమ అవసరాలకు డబ్బు తీసుకుని తర్వాత చెల్లించడానికి ఒక అవకాశం ఉంటుంది.
(ఇది కూడా చదవండి: Home Loan Tax Benefits: గృహ రుణంపై ఆదాయపు పన్ను రాయితీ పొందడం ఎలా..?)
ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి?
సులభంగా చెప్పాలంటే, మీ ఖాతాలో డబ్బు లేకున్న మీకు అవసరం ఉన్న మొత్తం Advanceగా తీసుకొని తర్వాత తిరిగి చెల్లించే ప్రక్రియను ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అయితే, మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మీరు డబ్బులు తిరిగి చెల్లించే సమయం ఎక్కువగా ఉంటే, ఎక్కువ వడ్డీ చెల్లించే అవకాశం ఉండవచ్చు.
ఓవర్ డ్రాఫ్ట్ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి?
- తాత్కాలిక ఆర్థిక సమస్యలు, ఊహించని ఖర్చులు లేదా అత్యవసర ఖర్చులకు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
- ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం వల్ల చెక్ బౌన్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
- మనం వినియోగించుకునే డబ్బుకు మాత్రమే వడ్డీ చెల్లించే అవకాశం ఉంటుంది.
- మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే ఏ సమయంలోనైనా మీ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
- వడ్డీతో సమస్య లేదు అనుకుంటే, మీ నచ్చినప్పుడు డబ్బులు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.