ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు శుభవార్త. అంతర్జాతీయంగా పెరిగిన ముడి సరుకు ధరల కారణంగా ఎరువుల కంపెనీలు భారీగా పెంచిన ధరలు కిందకు దిగి వచ్చాయి. రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచడంతో రైతులకు ఊరట కలిగింది. ఈ మేరకు తగ్గిన ధరలు మే 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. డీలర్లంతా తగ్గించిన ధరలకే ఎరువుల్ని అమ్మాలని స్పష్టం చేసింది.
రూ.1,200 మేర సబ్సిడీ
అంతర్జాతీయ మార్కెట్‌లో ఫాస్పరస్, అమ్మోనియా, పొటాష్, నైట్రోజన్ ధరలు 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో డీఏపీ, కొన్నిరకాల మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. గతేడాది రబీ సీజన్ ముగిసే నాటికి రూ.1,200 ఉన్న డీఏపీ బస్తా ధర ఏప్రిల్ నెలలో రూ.2,400కు పెరిగింది. డీఏపీతో పాటు ఇతర కొన్నిరకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను కూడా రూ.100 నుంచి రూ.500 వరకు పెంచాయి. ఈ పెంపు వల్ల రైతులపై భారీగా భారం పడుతుంది. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి ధరలు పెంచితే ఎలా అంటూ రైతు సంఘాలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సబ్సిడీని పెంచి రైతుపై భారం పడకుండా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తి మేరకు డీఏపీపై ఇచ్చే రూ.500 సబ్సిడీని రూ.1200కు (140 శాతం) పెంచుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్రం మీద రూ.14,775 మేర భారం పడనుంది. దీంతో రెండు నెలలపాటు భారీగా పెరిగిన ధరలు మళ్లీ కిందకు దిగి వచ్చాయి. కేంద్రం సబ్సిడీ పెంచడంతో డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు గతనెల 20 నుంచి అమల్లోకి వచ్చాయి. డీలర్లు ఎవరైనా గతంలో పెంచిన ధరలకు ఎరువుల్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.