ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్!

0
Safety Harness
  1. నాలుగేళ్లలోపు పిల్లలకు హెల్మెట్‌ తప్పనిసరి
  2. పెద్దవారితో కట్టి ఉంచే హార్నెస్‌ కూడా తప్పనిసరి
  3. వాహనవేగం గంటకు 40 కిలోమీటర్లు మించొద్దు

ద్విచక్రవాహనాలపై ప్రయాణించే నాలుగేళ్లలోపు చిన్నారులకు కూడా హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహనం నడిపేవారు లేదా వెనుక కూర్చున్న వారితో పిల్లలను అనుసంధానించే సేఫ్టీ హార్నెస్‌(నడుము, భుజాల మీదుగా కట్టి ఉండే బెల్ట్ వంటివి) తప్పనినరిగా ధరించాలని, పిల్లలు బండిపై ఉన్నంతసేపు గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో మాత్రమే నడపాలని కేంద్రం స్పష్టం చేసింది.

9 నెలల నుంచి నాలుగేళ్ల మధ్య వయసు పిల్లలు ద్విచక్రవాహనాలపై ప్రయాణించేందుకు ఈ నిబంధ వర్తిస్తాయని పేర్కొంటూ.. కేంద్ర రవాణా శాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1,000 జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దుచేస్తారని హెచ్చరించింది. ఏడాది తర్వాత అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. చిన్నారుల భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

చిన్నారులు సరిగా పట్టుకోలేక..
దేశవ్యాప్తంగా నాలుగేళ్లలోపు వయసున్న చిన్నారులు ద్విచక్రవాహనాల పైనుంచి పడి మృత్యువాతపడటం, తీవ్రంగా గాయాలపాలవడం వంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలపై వెళ్ళేటప్పుడు నాలుగేళ్లలోపు చిన్నారులు వారంతట వారుగా పెద్దవారిని గట్టిగా పట్టుకుని కూర్చునే పరిస్థితి ఉండదు. పెద్దవారే చిన్నారులను చేతులతో పట్పుకుని ‘కూర్చుంటున్నాం కాస్‌ రోడ్డు సరిగా లేనిచోట, గుంత! , స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నచోట కుదుపులకు పట్టుజారి పిల్లలు పడిపోతున్నారు.

కొన్నిసార్లు పెద్దవారు. సరిగా పట్టుకోకపోవడం, నిద్రమత్తు వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం మోటారు వాహనాల చట్టంలో కొత్త నిబంధనలను తెచ్చింది. బైక్‌ నడిపేవారుగానీ, వెనకాల కూర్చున్నవారుగానీ సేఫ్టీ హార్నెస్‌తో పిల్లలను అనుసంధానం చేసుకుంటే… వారు జారిపడే అవకాశం ఉండదని సృష్టం చేసింది. ఈ హార్నెస్‌లు 30కేజీల బరువు మోసేలా రూపొందించాలని తయారీ సంస్థలకు సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here