ప్రపంచంలో అధిక జనాభా కలిగిన చైనా దేశం టెక్నాలజీ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. ఎప్పుడు విభిన్న ప్రయోగాలు చేపడుతూ ప్రపంచానికి సవాలు విసిరే చైనా ఇప్పుడు మరో కొత్త ప్రయోగనికి శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితమే కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా ఇప్పడు అధునాతన సాంకేతిక సహాయంతో పట్టాలపై గాల్లో తెలియాడుతూ వేగంగా ప్రయాణించే మాగ్లెవ్ రైలును సృష్టించిది. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రైలు చక్రాలు లేకుండా గాల్లో తెలియాడుతూ గంటకు 620 కిలోమీటర్ల (385 మైళ్ళు) వేగంతో ప్రయాణించనుంది.(ఇంకా చదవండి: భవిష్యత్ లో ప్రపంచంలో రాబోయే భారీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ఇదే!
47 నిమిషాలలో లండన్ టూ పారిస్
మాగ్నెటిక్ లెవిటేషన్, హై టెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీ (హెచ్‌టీఎస్)సహాయంతో దీనికి రూపకల్పన చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లన్నింటికంటే వేగంగా ఈ రైలు దూసుకుపోతుందని వారు పేర్కొన్నారు. అయస్కాంతీకరించిన ట్రాక్‌లపై తేలు తున్నట్లుగా ప్రయాణించే ఒక రైలు వీడియోను చైనాకు చెందిన ఒక మీడియా షేర్ చేసింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డు నగరంలో 21 మీటర్ల పొడవు (69 అడుగులు)గల ఒక మాగ్లెవ్ రైలు నమూనాను మీడియాకు ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు 165 మీటర్ల(541 అడుగుల) గల ఒక ట్రాక్‌ను పరీక్షల కోసం నిర్మించారు.
మాగ్లెవ్ రైలు రూపకల్పనలో భాగమైన ఒక ప్రొఫెసర్ హి చువాన్(సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంట్) విలేకరులతో మాట్లాడుతూ.. మూడు నుంచి 10 సంవత్సరాలలో ఈ రైలు పట్టాలెక్కనుంది అని పేర్కొన్నారు. “సిచువాన్ ప్రావిన్స్ అద్భుతమైన భూమి వనరులను కలిగి ఉంది. ఇది మా శాశ్వత అయస్కాంత ట్రాక్‌ల నిర్మాణానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, తద్వారా ప్రయోగాలను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు. 620 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలులో లండన్ నుంచి పారిస్ చేరుకోవడానికి కేవలం 47 నిమిషాలకు పడుతుంది. భవిష్యత్ లో ఈ వేగాన్ని 800 కి.మీ.కు విస్తరించడానికి పరిశోధకులు కృషి చేస్తున్నారు.(ఇంకా చదవండి: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ ఖాతా మరింత సురక్షితం!)
హై-స్పీడ్ షాంఘై మాగ్లెవ్ రైలు
గంటకు 620 కిమీల వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ లోపల ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా సీట్లు వాటి మధ్య ఏర్పాట్లు ఉంటాయి. అలాగే బోగీలో ఓ పేద్ద ఎల్ఈడీ టీవీ కూడా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద 37,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న హై-స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌కు చైనా నిలయంగా ఉంది. చైనాలో వాణిజ్యపరంగా వేగంగా ప్రయాణించే రైలు పేరు షాంఘై మాగ్లెవ్. చైనా మొట్ట మొదటి హై-స్పీడ్ మాగ్లెవ్ రైలు 2003లో నుంచి పనిచేయడం ప్రారంభించింది. గంటకు 431 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఈ రైలు షాంఘై పుడోంగ్ విమానాశ్రయం మరియు షాంఘై యొక్క తూర్పు వైపున ఉన్న లాంగ్యాంగ్ రహదారిని కలుపుతుంది.

జపాన్ తో చైనా పోటీ
2022 బీజింగ్‌లో జరగబోయే వింటర్ ఒలింపిక్స్‌కు ముందు మరిన్ని మౌలిక సదుపాయాల మెరుగుదల చేయడానికి చైనా ఆసక్తిగా ఉంది. గత ఏడాది ఈ సమయానికి 2022 వింటర్ ఒలింపిక్స్ జరగబోయే జాంగ్జియాకౌను, బీజింగ్‌ను కలుపుతూ 174 కిలోమీటర్ల కొత్త హైస్పీడ్ రైల్వే మార్గాన్ని చైనా ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ప్రయాణ సమయం 3 గంటల నుంచి 47 నిమిషాలకు తగ్గిపోయింది. టెక్నాలజీకి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లో దశాబ్దాల క్రితమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లో ఈ రైళ్లు గంటకు 320 కిమీల వేగంతో ప్రయాణిస్తాయి. జపాన్ కూడా మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత సాయంతో 603కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లను తయారు చేస్తుంది. దీంతో మాగ్లెవ్ రైలు, కృత్రిమ సూర్యుడి తయారీలో చైనా జపాన్ దేశంతో పోటీ పడబోతుంది.
మొత్తం వ్యాసం చదవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.