సాదారణంగా ఏదైనా జీపు లేదా నాలుగు చక్రాల వాహనం మరమ్మతులకు గురి అయితే మనం ఏమి చేస్తాం మహా అయితే, ఆ వాహనాన్ని అక్కడే విడిచి పెట్టి మెకానిక్ తీసుకొచ్చి రిపేర్ చెపిస్తాం. కానీ ఒక సీఐ మాత్రం మరమ్మతులకు గురైన జీపును ఏకంగా మెకానిక్ షెడ్ వద్దకు లాక్కెళ్లి నెటిజన్ల చేత బాహుబలి అనే ప్రశంసలు అందుకున్నారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా యలబుర్గి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు రెడ్డి శుక్రవారం ఓ కేసు విచారణ కోసం అని స్కార్పియో వాహనాన్ని స్వయంగా నడుపుతూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
అయితే, తిరిగి వచ్చే క్రమంలో వాహనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలేదు. దీంతో అతను ఒక్కడే 20 మీటర్ల దూరంలోని మెకానిక్ షెడ్ వద్దకు స్వయంగా వాహనాన్ని లాక్కొని వెళ్లారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ పోలీసును బాహుబలి అంటూ సందేశాలు పోస్టు చేశారు. శారీరక దృఢత్వంతో ఇలాంటి సాహసాలు చేయవచ్చని పేర్కొన్నారు. సరైన శారీరక ధారుడ్యం ఉంటే ఇలాంటి పనులు చేయవచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.