Covid-19 Vaccine: దేశంలో 18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్న వారికి కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ అందజేసేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. 45 ఏళ్లు పైబడినవారికి ఇప్పటికే టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18-45 ఏళ్ల వ్యక్తులకు మే 1వ తేదీ నుంచి టీకా అందజేస్తారు. అపాయింట్‌మెంట్ కోసం కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ధ్రువపత్రాలను ఆప్‌లోడ్ చేయాలి.
18 ఏళ్లు దాటినవారి కొసం ఏప్రిల్ 24 నాటికి కోవిన్ పోర్టల్ సిద్దమవు తుందని, ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రీయ ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రైవేట్ కరోనా వాక్సినేషన్ సెంటర్లు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి టీకా డోసులను తీసుకొని, ఒక్కో డోసును రూ.250 చొప్పున ధరకు అర్హులకు అందజేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మే1వ తేదీ నుంచి ఈ విధానం ఉండదు. ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు నేరుగా టీకా తయారీ సంస్థల నుంచే డోసులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా సహాయం కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 1075కీ కాల్ చేయండి.(ఇది చదవండి: జూలైలో రాబోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్!)
కోవిన్ పోర్టల్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?:
- కోవిన్ పోర్టల్ని సందర్శించిన తర్వాత రిజిస్టర్/సైన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి మరియు గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఓటీపీ అందుకున్న తర్వాత సైట్ ఓటీపీ ఎంటర్ చేసి ‘వెరిఫై’ మీద క్లిక్ చేయండి.
- వ్యాక్సినేషన్ రిజిస్టర్ పేజీలో ఫోటో ఐడి ప్రూఫ్, పేరు, లింగం, పుట్టిన సంవత్సరంతో సహా మీ అన్ని వివరాలను నమోదు చేయండి. ఇది పూర్తయిన తర్వాత రిజిస్టర్ ని క్లిక్ చేయండి.
- మీరు రిజిస్టర్ చేసిన తర్వాత అపాయింట్ మెంట్ కోసం షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ మీకు లభిస్తుంది. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి పేరు పక్కన ‘షెడ్యూల్’ మీద క్లిక్ చేయండి.
- మీ దగ్గరలోని కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాల గురుంచి తెలుసుకునేందుకు మీ ప్రాంతం పోస్టల్ పిన్ కోడ్ ద్వారా సర్చ్ చేయండి. ఇప్పుడు మీకు దగ్గరలోని కేంద్రాలు కనిపిస్తాయి.
- ఇప్పుడు మీరు ఏ సమయంలో టీకా వేయించుకోవాలి అనుకుంటునారో ఆ తేదీ సమయాన్ని ఎంచుకుని ‘Confirm’పై క్లిక్ చేయండి.
ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ లో కుడి పక్కన ఉన్న కోవిన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
- ‘వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్’ ఎంచుకొని తర్వాత మీ ఫోన్ నెంబరు నమోదు చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ‘Proceed’ మీద క్లిక్ చేయండి.
- ‘వ్యాక్సినేషన్ రిజిస్టర్’ పేజీలో, ఫోటో ఐడి ప్రూఫ్, పేరు, లింగం, పుట్టిన ఏడాదితో సహా అన్ని వివరాలను నమోదు చేసి ‘SUBMIT’ మీద క్లిక్ చేయండి.
- మీరు రిజిస్టర్ చేసిన తర్వాత, అపాయింట్ మెంట్ షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ మీకు లభిస్తుంది. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి పేరు పక్కన షెడ్యూల్ మీద క్లిక్ చేయండి.
- మీ దగ్గరలోని కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాల గురుంచి తెలుసుకునేందుకు మీ ప్రాంతం పోస్టల్ పిన్ కోడ్ ద్వారా సర్చ్ చేయండి. ఇప్పుడు మీకు దగ్గరలోని కేంద్రాలు కనిపిస్తాయి.
- ఇప్పుడు మీరు ఏ సమయంలో టీకా వేయించుకోవాలి అనుకుంటునారో ఆ తేదీ సమయాన్ని ఎంచుకుని ‘Confirm’పై క్లిక్ చేయండి.
ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
స్లాట్లు లేకపోతే నేను ఏమి చేయాలి?
స్లాట్ల లభ్యత లేకపోతే మరుసటి రోజు మళ్లీ అపాయింట్‌మెంట్ స్లాట్‌ల కోసం ప్రయత్నించండి.
నేను అపాయింట్‌మెంట్ ను రీ-షెడ్యూల్ చేయవచ్చా?
చేయవచ్చు. కానీ, మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న ముందు రోజువరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
సెకండ్ డోస్ కోసం నేను మళ్ళీ నమోదు చేసుకోవాలా?
మొదటి మోతాదుకు టీకాలు వేసిన తర్వాత, యూజర్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ కోసం ఆటో మేటిక్ గా అపాయింట్‌మెంట్ కోసం షెడ్యూల్ చేయబడతారు. ఒకవేళ యూజర్ మరొక నగరానికి మారినట్లయితే, ఆ నగరంలోని సమీప టీకా కేంద్రానికి తిరిగి షెడ్యూల్ చేసుకోవచ్చు.
టీకా కేంద్రానికి నేను తీసుకెళ్లవలసిన పత్రాలు ఏమిటి?
టీకా కేంద్రానికి అపాయింట్‌మెంట్ నిర్ధారణ లేఖతో పాటు ఆ వ్యక్తి కో-విన్ 2.0 పోర్టల్‌లో పేర్కొన్న ఫోటో ఐడీని తీసుకెళ్లాలి. 45 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాదులు ఉన్నవారు టీకా సమయంలో వైద్య ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.