డేటింగ్‌ పేరుతో లక్షలు కాజేస్తున్న సైబర్ క్రిమినల్స్‌!

0

ఇండియన్ మ్యానేజ్మెంట్‌ విద్య పూర్తి చేసిన బెంగళూరుకు చెందిన రాజ్‌వన్స్‌ మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, టీకప్పుల తయారీ పరీశ్రమ నిర్వహించి నష్టాలు రావడంతో ఈజీ మనీకోసం ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్‌ ‘క్వాక్‌ క్వాక్‌’లో అమ్మాయిలకు వల వేసేందుకు బడా బిజినెస్‌మెన్‌ అంటూ వివరాలు నిక్షిప్తం చేశాడు. దీనికి స్పందించిన రాచకొండ కమిషనరేట్‌ ప్రాంతానికి చెందిన ఓ వితంతువుకు బెంగళూరులో బాగా లాభాలు చేకూర్చే హౌస్‌ కీపింగ్‌ సంస్థను నిర్వహిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాటలు కలిపాడు.

తన వ్యాపార విస్తరణకు, వైద్యం కోసం డబ్బులు అవసరమంటూ చెప్పడంతో బాధితురాలు దఫాదఫాలుగా రూ.మూడు లక్షలు రాజ్‌వన్స్‌ బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత తన కాల్స్‌కు స్పందించకపోవడంతో రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఈ ఒక్కటేకాదు. ఇటీవల ఈ తరహా డేటింగ్‌ సైట్‌ కేంద్రాలుగా మోసపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

డేటింగ్‌ చేస్తానంటూ అమ్మాయిలకు… అదే రీతిలో అబ్బాయిలను మోసం చేస్తున్న అమ్మాయిలు… మాటలతో కవ్వించి అవసరార్థం అంటూ బ్యాంక్‌ ఖాతాల్లో నుంచి దఫదఫాలుగా రూ.లక్షలు లాగేస్తున్నారు. తొలుత వాట్సాప్‌ నంబర్‌ తీసుకొని… చాటింగ్‌ చేస్తూ… ఆ తర్వాత్‌ కాల్‌ చేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నకేసులు ఈ కాలంలో ఎక్కువయ్యాయి. ఇటు సైబరాబాద్‌, అటు రాచకొండ సైబర్‌కైమ్‌ ఠాణాలకు డేటింగ్‌ చీటింగ్‌ కేసులు దాదాపు‌ 20 వరకు నమోదయ్యాయి. డేటింగ్‌ సైట్లకు వెళ్లి అపరిచితులతో పరిచయం పెంచుకోవద్దు అని రాచకొండ సైబర్‌కైమ్‌ ఏసీపీ హరనాథ్‌ తెలిపారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here