భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్ విలువకు VS మార్కెట్ విలువకు తేడా ఏంటి?

0
Land Market value

మనం ఏదైనా ఇల్లు లేదా వ్యవసాయ భూములు కొనేటప్పుడు ఈ రెండూ పదాలు మనకు చాలా ఎక్కువగా వినిపిస్తాయి. అయితే, ఈ కథనంలో మనం ఈ రెండూ పదాల గురుంచి ఎక్కువగా తెలుసుకుందాం.

రిజిస్ట్రేషన్ విలువ(Registration Value)

ఈ రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వ(Government value) వాల్యూ అని అంటారు. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం భూములు, ఇండ్ల స్థలాల మార్కెట్ వీలువను కాలానుగుణంగా పెంచుకుంటూ పోతుంది. అయితే, ప్రతి రెండూ లేదా 3 ఏళ్లకు ఒక భూముల విలువను సవరిస్తుంది. ఆ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు, ఇండ్లు, ప్లాటలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధరను నిర్ణయిస్తుంది. ఆ ధర కంటే తక్కువ ధరకు భూములు, ఇండ్ల స్థలాలను అమ్మడానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ధరలను నిర్ణయిస్తుంది. కాబట్టి, వాటిని భూ రిజిస్ట్రేషన్ విలువ అంటారు.

ఆ భూ రిజిస్ట్రేషన్ విలువకు చాలా వరకు బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. అయితే, బ్యాంకులు ఇచ్చే రుణాల విలువ మీరు ఉండే ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది. అలాగే, మనం ఏదైనా ఒక ఆస్తి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ తెలిపే ఆస్తి విలువను రిజిస్ట్రేషన్ విలువ అని కూడా అంటారు.

రియల్ మార్కెట్ విలువ(Real Market Value)

రియల్ మార్కెట్ విలువ అంటే ప్రస్తుతం ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక అసలు ఆస్తి విలువను తెలియజేయడాన్ని రియల్ మార్కెట్ విలువ అంటారు. రిజిస్ట్రేషన్ విలువకు రియల్ మార్కెట్ విలువ 4 లేదా 5 రేట్లు ఎక్కువగా ఉంటుంది.

రిజిస్ట్రేషన్ విలువకు VS రియల్ మార్కెట్ విలువకు తేడా?

ఉదాహరణకు కింద చూపించిన విధంగా ఒక గ్రామంలో రిజిస్ట్రేషన్ విలువ లేదా ప్రభుత్వ మార్కెట్ విలువ అనేది రూ. 3 లక్షలు ఉంటే, అదే ప్రాంతంలో రియల్ మార్కెట్ విలువ అనేది 5 నుంచి 10 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో సుమారు రియల్ మార్కెట్ విలువ అనేది రూ. 15 లక్షల వరకు ఉంటుంది. భూ రిజిస్ట్రేషన్ సమయంలో చాలా మంది ఆస్తి అసలు విలువ కంటే చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ పత్రంలో చూపిస్తారు. ఇలా చూపించడానికి ప్రధాన కారణం రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి తప్పించుకోవడం కోసం అలా చేస్తారు.

రియల్ మార్కెట్ విలువతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉండటం వల్ల కలిగే నష్టాలు?

రియల్ మార్కెట్ విలువతో పోలిస్తే రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉండటం వల్ల మనకు ఏదైనా భూ వివాదం ఏర్పడినప్పుడు. పరిహారం కూడా రిజిస్ట్రేషన్ విలువ మీదే లభిస్తుంది. రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా చూపించడం వల్ల బ్యాంకులు కూడా ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here