కోవిడ్ టీకా మొదటి డోస్ కోసం మాత్రమే రిజిస్టేషన్ చేసుకోవాలని, రెండో డోస్ కోసం మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వచ్చే నెల 1నుంచి ప్రారంభమయ్యే టీకా ప్రక్రియ కోసం కోవిన్ పోర్టల్‌లో మార్గదర్శకాలను వెల్లడించింది. టీకా కోసం వెళ్లే వ్యక్తులు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? నమోదు చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు టీకా నమోదు లేదా వ్యాక్సినేషన్‌కు వెళ్లే సమయంలో చేయకూడని పనుల పొందుపరిచింది.(ఇది కూడా చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా!)
దీని ప్రకారం.. వచ్చే నెల 1నుంచి టీకా కోసం వెళ్లే వ్యక్తులు కచ్చితంగా. కోవిన్ పోర్టల్ లేదా అరోగ్యసేతు లేదా ఉమాంగ్ పోర్టల్‌లో రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకు ఆయా వ్యక్తుల వివరాలతో పాటు మొబైల్ నంబర్ ఇవ్వాలి. రిజిస్టేషన్ సమయంలోనే గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) వివరాలను కూడా అప్‌లోడ్ చేయాలి. ఒకరు ఒక మొబైల్ నంబర్ ద్వారా, ఒక ఐడీ కార్డుతో, ఒక్క పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వ్యాక్సిన్ కోసం వెళ్లేటప్పుడు రిజిస్టేషన్ సమయంలో ఇచ్చిన ఐడీ కార్డు జిరాక్స్‌నే తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ కోసం ఒక ఐడీ కార్డు, వాక్సిన్ కు వెళ్లేటప్పుడు మరో ఐడీ కార్డును తీసుకోళ్తే అనుమతించారు.
వాక్సిన్ కోసం నమోదు చేసుకునే సమయంలోనే సమీపంలోని టీకా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టేషన్ పూర్తయిన తర్వాత.. ఎంపిక చేసుకున్న కేంద్రానికి, నిర్దేశత సమయంలో వెళ్లాల్సి ఉంటుంది. టీకా వేయించుకున్నాక కచ్చితంగా 30 నిమిషాలు టీకా కేంద్రంలోనే వేచి ఉండాలి. టీకా వేయించుకునేటప్పుడు భౌతికదూరం, మాస్కు వంటి నిబంధనలు పాటించాలి. ఏవైనా ఎఫెక్ట్స్ ఉన్నా ఇతర సందేహాలున్నా 1075 టోల్‌ఫ్రీ లేదా +91 1123978046 నంబర్‌కు ఫోన్ చేయాలని కోవిన్ పోర్టల్‌లో వెల్లడించారు.
చేయకూడనివి ఇవే…
టీకా నమోదులో చేయకూడని అంశాలను కూడా కోవిన్ పోర్టల్ వెల్లడించింది. దాని ప్రకారం..
- రిజిస్టేషన్ చేయకుండా టీకా కోసం వెళ్లొద్దు.
- ఒక వ్యక్తి టీకా కోసం రెండు, మూడు పోర్టల్‌లలో నమోదు చేసుకోకూడదు. ఏదో ఒకదానిలో మాత్రమే నమోదు చేసుకోవాలి.
- ఒక వ్యక్తి పలు ఫోన్ నంబర్లు, వివిధ గుర్తింపు కార్డుల ద్వారా నమోదు చేసుకోకూడదు.
- టీకా వేయించుకునే రోజు ఆల్కహాల్ కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ తీసుకోకూడదు.
- ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే అతిగా భయపడి గందరగోళానికి గురికాకూడదు.
- రెండో డోస్ కోసం ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.