పెట్రోలియం కంపెనీలు సామాన్యులకు మళ్లీ షాక్ ఇచ్చింది. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.25కు పెంచింది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.859.5కు పెరిగింది. ఇంతకు ముందు దీని ధర రూ.834.50గా ఉంది. గతంలో జూలై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.25.50కు పెంచింది. ప్రస్తుతం ముంబైలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ.859.5గా ఉంది.
హైదరాబాద్‌లో రూ.887లుగా ఉన్న గ్యాస్ ధర తాజాగా రూ.25 పెరిగి రూ.912కి చేరింది. సాధారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ల(ఎల్‌పీజీ ధర) ధరను సవరిస్తుంది. 2021 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉంటే నేడు రూ.859.5కు పెరిగింది. ఏడాదిలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు 165.50 రూపాయలు పెరిగాయి.