Driving License: కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్‌!

0

మీరు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. ఇక డ్రైవింగ్ లైసెన్స్ కోసం అని ప్రాంతీయ రవాణా కార్యాలయాల(ఆర్టీఓ) వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలాగే, ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం జూలై 1 నుంచి లైసెన్స్ తీసుకునే వ్యక్తి మీ దగ్గరలోని ప్రభుత్వం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు కింద డ్రైవర్‌గా ఈ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలాంటి సందర్భంలోనే డ్రైవింగ్ లెసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ శిక్షణ కేంద్రాల వద్ద సిమ్యులేటర్లు, దరఖాస్తుదారుల హైక్వాలిటీ ట్రైనింగ్ కోసం ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉంటాయి. ప్రభుత్వం గుర్తించిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలలో లైట్ మోటార్ వేహికల్ డ్రైవింగ్ కోర్సు ప్రారంభం అయిన తేదీ నుంచి గరిష్టంగా నాలుగు వారాల(29 గంటలు) ఈ కోర్సు ఉంటుందని నోటిఫికేషన్ లో ఉంది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు కూడా ఉంటుంది.

అలాగే, శిక్షణ కేంద్రాలలో మీడియం, హెవీ మోటార్ వేహికల్ డ్రైవింగ్ కోర్సుల కాలవ్యవధి ఆరు వారాల వ్యవధి(38 గంటలు). ఇందులో కూడా రెండు సిగ్మెంట్లు ఉంటాయి. ఒకటి థియరీ అయితే రెండవది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో భాగంగా రోడ్డుపై ఇతరులతో నైతికంగా, మర్యాదపూర్వకంగా ఎలా నడుచుకోవలో వంటి కొన్ని ప్రాథమికాంశాలను శిక్షణలో నేర్పిస్తారు. ఈ కోర్సు వల్ల నైపుణ్యం కలిగిన డ్రైవర్లు రోడ్ల మీదకు వస్తారని కేంద్రం పేర్కొంది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల కొరకు మంజూరు చేయబడ్డ అక్రిడిటేషన్ ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పునరుద్దరించుకోవచ్చు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here