దుబాయ్‌లో డ్రోన్ల సహయాంతో కృత్రిమ వర్షం!

0

Dubai Drones Rain: గతంలో అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీ టెక్నాలజీ కృత్రిమ వర్షాలను కురిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అప్పుడు అది అనుకున్నంత మొత్తంలో విజయవంతం కాలేదు. మానవుడు తన మేధస్సుతో అతి తక్కువ వర్షపాతంను అధిగమించడం కోసం క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీనుపయోగించి కృత్రిమ వర్షాలు పడేలా చేస్తున్నాడు. ప్రస్తుతం క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీతో పోలిస్తే.. మరింత తక్కువ ఖర్చుతో కృత్రిమ వర్షం కురిసేలా శాస్త్రవేత్తలు మరో అద్భుత ఆవిష్కరణను కనుగొన్నారు.

మేఘాలకు షాక్!

యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లాంటి ఏడారి దేశాల్లో వర్షం కురవడం అనేది దాదాపు అసాద్యం. అలాంటిది అక్కడ ఉన్న వీపరితమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కల్పించడానికి కృత్రిమ వర్షం కురిసేలా కొత్త ఆవిష్కరణను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డ్రోన్ల సహాయంతో మేఘాలను విద్యుత్‌ ఆవేశానికి గురిచేసి కృత్రిమంగా వర్షాలు కురిసేలా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతమైంది. తాజాగా దుబాయ్‌లో ఈ టెక్నాలజీతో 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలను అధిగమించి కృత్రిమ వర్షం పడేలా శాస్త్రవేత్తలు చేశారు. దుబాయ్‌లో ఒక హైవేపై కృత్రిమ వర్షం పడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిలో సిల్వర్‌ అయోడైడ్‌ లాంటి రసాయనాలను మేఘాల్లోకి విస్తరింపజేయడంతో కృత్రిమ వర్షాన్ని కురిసేలా చేస్తారు. ఈ క్లౌడ్‌ సీడింగ్‌ పద్దతిని 1940లోనే కనుగొన్నారు. అనేక దేశాలు ఈ పద్దతినుపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా వర్షం కురిపించడానికి సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్యారియర్లుగా ఉపయోగిస్తారు. యూఏఈ శాస్త్రవేత్తలు ఈ పద్దతికి బదులుగా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. మేఘాల్లోకి డ్రోన్ల సహయంతో ఎలక్ట్రిక్‌ ఛార్జ్‌ను విడుదల చేయడంతో వర్షం పడేలా అది మేఘాలను ప్రేరేపిస్తుంది.

ఇతర క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీ పోలిస్తే డ్రోన్లనుపయోగించి మేఘాలను ఎలక్ట్రిక్‌ ఛార్జ్‌ చేయడంతో కృత్రిమ వర్షపాతం కురిసేలా చేయడం మరింత​ సులువు అని యూఏఈ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డ్రోన్ల సహాయంతో కేవలం దుబాయ్‌లో మాత్రమే కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నారంటే పొరపడినట్లే.. అమెరికాలోని 8 రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందండం కోసం డ్రోన్ల సహాయంతో సిల్వర్‌ అయోడైడ్‌ రసాయనాలను మేఘాలపై విస్తరింపజేసి ఆయా ప్రాంతాల్లో కృత్రిమ వర్షపాతం నమోదవుతుంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here