భారత్ లో స్టార్‌లింక్‌ హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు

0

ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌ ప్రాజెక్టు లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 2021 చివరి నాటికి లేదా 2022 ఆరంభం నాటికి ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ మరియు తక్కువ ఇంటర్ నెట్ స్పీడ్ పొందుతున్న ప్రజలకు అందించడానికి స్టార్‌లింక్ కృషి చేస్తునట్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీని కోసం దిగువ భూమి కక్ష్యలోని ప్రయాణించనున్న 42,000 ఉపగ్రహాల సహాయంతో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్ నెట్ ను అందించనున్నట్లు తెలిపారు.

భారత్ లో కూడా స్టార్‌లింక్‌ సేవలను 2021 చివరి నాటికి అందిచాటానికి స్టార్ లింకు కృషి చేస్తునట్లు స్పేస్‌ఎక్స్‌ శాటిలైట్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలు ప్యాట్రిసియా కూపర్ పేర్కొన్నారు. ఇప్పుడు, “బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ మరియు మెరుగైన బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రోత్సహించడానికి” ఒక రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన సంప్రదింపు పత్రాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) కంపెనీ పంపించిదని ప్యాట్రిసియా కూపర్ తెలిపారు. అలాగే భారత ప్రభుత్వం శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీని నవీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. (చదవండి: రెడ్‌మీ తొలి 5జీ ఫోన్‌.. ఫీచర్లివే!)

SpaceX Starlink Mission

స్పేస్‌ఎక్స్‌ శాటిలైట్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలు ప్యాట్రిసియా కూపర్ సమర్పించిన పత్రంలో ఈ విదంగా పేర్కొన్నారు. “స్టార్లింక్ యొక్క అధిక సామర్థ్యం, ​​అధిక-వేగం, తక్కువ-జాప్యం గల ఉపగ్రహ నెట్‌వర్క్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని త్వరలో ప్రతి భారతీయుడికి అందించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు వెళ్తుంది. ప్రత్యేకించి ఇప్పుడు లేదా సమీప భవిష్యత్ లో పట్టణ మరియు సబర్బన్ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని. సాంప్రదాయక వైర్ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా కలిగే అధిక ఖర్చులను తగ్గించడానికి కూడా స్పేస్‌ఎక్స్ ఒక పరిష్కారం చూపిస్తుందని” ఆమె తెలిపింది. (చదవండి: ప్రపంచంలోని టాప్ – 10 స్మార్ట్ ఫోన్స్ ఇవే!)

నమ్మకమైన హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్ నెట్ సేవలను ‘చివరి-మైలు’ వరకు అందించడానికి ఖరీదైన ఫైబర్ లైన్లు అవసరం లేదు అని స్పేస్‌ఎక్స్ తెలిపింది. వాస్తవానికి, స్పేస్‌ఎక్స్ యొక్క స్టార్‌లింక్ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా ‘చివరి-మైలు’ వినియోగదారులు కూడా ఇంటి నుండి నేరుగా కక్ష్యలోని ఉపగ్రహాని ద్వారా కు-బ్యాండ్(KU-Band)కనెక్షన్‌ను పొందవచ్చు అని తెలిపింది. సమీప కాలంలో భారతదేశంలో ప్రతి ఒక్కరికీ బ్రాడ్‌బ్యాండ్ అందించడానికి అయ్యే ఖర్చును కూడా ఈ స్టార్‌లింక్ ప్రయోగం ద్వారా తగ్గించవచ్చు అని తెలిపింది. TRAIకి రాసిన లేఖలో, స్పేస్ఎక్స్ “blanket” లైసెన్సింగ్ టూల్స్ మరియు “బ్యాండ్-స్ప్లిటింగ్” మోడల్ ను అందిచాలని ప్రభుత్వాన్ని స్పేస్ ఎక్స్ కోరింది. దీని ద్వారా స్పెక్ట్రంను భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల పంచుకోవడానికి సహాయ పడుతుందని తెలిపింది.

ఏదేమైనా, స్పేస్ఎక్స్ యొక్క స్టార్ లింకు ప్రాజెక్టును భారతదేశంలో ప్రవేశపెడుతుందా లేదా అనే దానిపై అనిశ్చితి ఉంది, ఎందుకంటే గత నెలలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీ ఆఫ్ ఇండియా 2020 ముసాయాదను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీని స్పేస్-బేస్డ్ కమ్యూనికేషన్ పాలసీ ఆఫ్ ఇండియాతో భర్తీ చేయాలని భావిస్తున్నారు. ముసాయాద మార్గదర్శకాల ప్రకారం విదేశీ కంపెనీలు తమ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ను భారతదేశంలో ప్రవేశ పెట్టకూడదు.(చదవండి: ప్రపంచంలో బెస్ట్ డిస్‌ప్లే ఫోన్ ఇదే!)

స్టార్ లింకు అంటే ఏమిటి?

మీరు స్టార్ లింకు అనే పేరును నిశితంగా గమనించినట్లయితే మీరు దానికి ఆ పేరును ఏందుకు పెట్టారో తెలుస్తుంది. మనం భూమి నుండి అంతరిక్షంలోని నక్షత్రాలను చూస్తే ఏ విదంగా కనిపిస్తాయో ఆ విదంగా స్టార్ లింకు ద్వారా ప్రయోగించబోయే 42,000 ఉపగ్రహాలు కూడా చూస్తే ఆదేవిదంగా కనిపిస్తాయి.

స్టార్ లింకు ప్రాజెక్టును 2015లో అధికారికంగా ప్రారంభించారు. ఈ స్టార్ లింకు ప్రాజెక్టులో భాగంగా భూమి యొక్క దిగువ కక్ష్యలో 700కిమీ ఎత్తులో 42,000 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. 2018లో మొట్ట మొదటి సారిగా 2 ప్రోటో టైప్ ఉపగ్రహాలను ప్రయోగించారు. 24 అక్టోబర్ 2020 నాటికి , స్పేస్ఎక్స్ 895 స్టార్ లింకు ఉపగ్రహాలను ప్రయోగించింది. 2020లో ప్రతి రెండు వారాలకు ఒకసారి ప్రయోగాలతో, ఫాల్కన్ 9 విమానం ద్వారా 60 ఉపగ్రహాల వరకు కక్ష్యలోకి ప్రయోగించాలని వారు యోచిస్తున్నారు. 2021 చివరికి దాదాపు 12,000 ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలో పంపించాలని యోచిస్తున్నారు, తరువాత వీటిని 42,000 వరకు పొడగించనున్నారు.

ఈ బ్రాడ్ బ్యాండ్ ద్వారా సరసమైన ధరలకే అందుబాటులో లేని ప్రదేశాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. స్పేస్‌ఎక్స్ స్టార్ లింకు ద్వారా 2020 ఆగస్టులో ఉత్తర యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలోని బీటా వినియోగదారులకు 100 ఎమ్‌బిపిఎస్ కంటే ఎక్కువ డౌన్‌లోడ్ వేగాన్ని అందించినట్లు పేర్కొంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here