గుడ్ న్యూస్: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త అందించిన ఈపీఎఫ్‌వో

0

దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త అందించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో). ప్రభుత్వ ఉద్యోగుల లాగానే పదవి విరమణ చెందగానే పింఛన్ వచ్చినట్లు తమకు రావడానికి చాలా ప్రయాస పడేవారు ప్రైవేట్ ఉద్యోగుల. ఇకా ప్రైవేట్ వేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పద్ధతి ప్రకారం ఉద్యోగి ఏ రోజైతే పదవీ విరమణ పొందుతాడో అదే రోజు నుంచి పింఛన్ మొదలవుతుంది అని ఈపీఎఫ్‌వో తెలిపింది.(చదవండి: కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ పథకానికి ధరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

ఈ విషయం అనేది ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఒక వరం లాంటిదని ఈపీఎఫ్‌వో వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త పద్ధతి ఈ నెల 30 నుంచే అమల్లోకి రానుందని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత పింఛన్ ప్రక్రియ మొదలు కావాలంటే గతంలో నెలల తరబడి పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వయసు మీద పడి అప్పటికి అలసి పోయి ఉన్నవారికి ఇది ఒక గుదిబండలాంటిది దీనిలో ఎంతో పేపర్ వర్క్ ఉండేది. కానీ ఈ నెల 30 నుంచి ఇక ఆ పరిస్థితి ఉండదు. ఉద్యోగి రిటైర్ అయిన రోజు నుంచే ఆటోమేటిక్‌గా పెన్షన్ మొదలవుతుంది.(చదవండి: కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ పథకానికి ధరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here