ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త!

0
EPFO
EPFO

ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రిటైర్ మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు ఈ-నామినేషన్ దాఖలు గడువును పొడగించినట్లు పేర్కొంది. డిసెంబర్ 31 తర్వాత కూడా ఖాతాదారులు ఈ-నామినేషన్ ద్వారా నామినీలను జాతచేయవచ్చు అని రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఒక ట్వీట్లో తెలిపింది. ఇంతకు ముందు, ఈ-నామినేషన్ ద్వారా నామినీలను చేర్చడానికి చివరి తేదీ డిసెంబర్ 31న ముగుస్తుందని గతంలో తెలిపింది.

దీంతో ప్రజలు తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలను అప్ డేట్ చేయడానికి ప్రయత్నించడంతో ఈపీఎఫ్ఓ పోర్టల్ డౌన్ అయినట్లు చాలా మంది సంస్థకు వినియోగదారులు నివేదించారు. ప్రజలు నామినీ వివరాలను అప్ డేట్ చేయడంలో ఇబ్బందులు పడుతుండటంతో గడువును పొడగించింది. కానీ, ఎప్పటి వరకు అనేది తెలపలేదు. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), పెన్షన్(ఈపీఎస్), ఇన్స్యూరెన్స్(ఈడిఎల్ఐ) ప్రయోజనాలను పొందాలంటే ఈ-నామినేషన్ తప్పనిసరి అని తెలిపింది. కేవలం ఈడిఎల్ఐ కిందనే రూ.7 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది అని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here