ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల

0

‎హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్ ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ టూ వీలర్ ఈజీ ప్లస్ ను లాంఛ్ చేసింది. ‎తక్కువ వేగం, తక్కువ బరువు కలిగిన ఈ ఎలక్ట్రిక్ మోడల్ 20ఆంపియర్, 250వాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఈజీ ప్లస్ ను ఫుల్ చార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ను నాలుగు రంగుల్లో అందుబాటుల్లో ఉంది. దీని ధర రూ.41,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈజీ ప్లస్‌ను టోకెన్ ద్వారా రూ.1,999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ 25 కి.మీ.(ఇది చదవండి: హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం)

ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, ట్యూబ్ లెస్ టైర్లు, డ్రమ్ బ్రేక్స్, పెడల్స్ వంటి లక్షణాలతో వస్తుంది. ఈజీ ప్లస్ 170 కిలోల వరకు బరువును మోయగలదు. 40,000 కిలోమీటర్ల వరకు చెల్లుబాటు అయ్యే ఈ స్కూటర్‌పై కంపెనీకి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీతో పాటు ఉచిత హెల్మెట్‌ను కూడా అందిస్తున్నారు.‎ డీటెల్ ఈజీ ప్లస్ ను ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలో భారతీయ రోడ్లకు సరిపడే విదంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.(ఇది చదవండి:  ఓలా సంచలనం: సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణం)

ప్రధానంగా టైర్-2, టైర్-3 సిటీ మార్కెట్లలో తన మార్కెట్ చాటుకోవాలని కంపెనీ యోచిస్తోంది. డీటెల్ ఎలక్ట్రిక్ వాహనం వాడటం వల్ల ఒక చెట్టును రక్షించినట్లే అని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనం తీసుకున్న కస్టమర్ పేరిట ఒక చెట్టు నాటడంతో పాటు జియోట్యాగ్ కూడా చేయనున్నట్లు పేర్కొంది.‎ ‎2017 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, వినియోగ గాడ్జెట్లతో మార్కెట్ లోకి ప్రవేశించడంతో పాటు డీటెల్ 2020 జనవరిలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here