Evaru Meelo Koteeswarulu: కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్న సంగతి మనకు తేలిసిందే. రాజారవీంద్ర ప్రైజ్ మనీ గెలిచిన ఎపిసోడ్ సోమ, మంగళ వారాల్లో రాత్రి 8.30 గంటలకు ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యింది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు.
2000-2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్, బ్యాంకుతో పాటు ఇతర ఉద్యోగాలు కూడా చేశారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సంపాదించారు. ఇది ఇలా ఉంటే ఎవరు మీలో కోటీశ్వరులు షోలో జూనియర్ ఎన్టీఆర్ అడిగిన కోటి రూపాయల ప్రశ్నకు మిలొ ఎంత మందికి సమాధానం తెలుసు?.
Evaru Meelo Koteeswarulu: షోలో రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!

రూ.6,40,000 ప్రశ్న: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నది ఎవరు?
1) లార్డ్ వేవెల్
2) లార్డ్ మౌంట్ బాటెన్
3) లార్డ్ ఏల్గిన్
4) లార్డ్ రిప్పన్
జవాబు: 2) లార్డ్ మౌంట్ బాటెన్
రూ.12,50,000 ప్రశ్న: ఒకే పారా ఒలింపిక్స్ లో బహుళ పతకాలు సాధించీన తొలి భారతీయ మహిళా ఎవరు?)
1) అవనీ లేఖరా
2) దీప మాలిక్
3) అంజలి భగవత్
4) భవానీ పటేల్
జవాబు: 1) అవనీ లేఖరా
రూ.25,00,000 ప్రశ్న: 2020లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో “40 రోజులు” అని అర్ధం వచ్చే ఒక పదం నుంచి వచ్చింది?
1) లాక్‌డౌన్
2) ఐసోలేషన్
3) క్వారంటైన్
4) పాండమిక్
జవాబు: 3) క్వారంటైన్
రూ.50,00,000 ప్రశ్న: జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్ధం జరుపుతారు? )
1) మిజోరాం
2) పశ్చిమ బెంగాల్
3) ఉత్తర ప్రదేశ్
4) కేరళ
జవాబు: 2) పశ్చిమ బెంగాల్
రూ.1,00,00,000 ప్రశ్న: 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్‌కు ఎవరు అద్యక్షత వహించారు?
1) రంగనాథ్ మిశ్రా
2) రంజిత్ సింగ్ సర్కారియా
3) బీపీ మండల్
4) ఎస్ ఫజల్ అలీ
జవాబు: 4) ఎస్ ఫజల్ అలీ