ఆన్‌లైన్‌లో లీకైన 53.3 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల డేటా

0

ఫేస్‌బుక్ సోషల్ మీడియా సంస్థకు చెందిన 53.3 కోట్ల యూజర్ల డేటా ఆన్‌లైన్‌లో లీకైంది. పెద్ద మొత్తంలో సేకరిస్తున్న డేటాను సంరక్షించడంలో ఫేస్‌బుక్ నానా తంటాలు పడుతుంది. లీకైన డేటాలో 533 మిలియన్ ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఫోన్ నంబర్లు, ఫేస్ బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్ లు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ చిరునామాల వంటి వ్యక్తిగత సమాచారం మొత్తం లీకైంది.(ఇది చదవండి: మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా)

అయితే, ఒక ఫేస్‌బుక్ ప్రతినిది మాత్రం ఇది 2019లో లీకైన పాత డేటా అని తన ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపాడు. “మేము ఈ సమస్యను ఆగస్టు 2019లో కనుగొని దానిని పరిష్కరించాము.” ఆ సమయంలో కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంలో ఒక చిన్న లోపం ద్వారా డేటా లీకైంది. అయితే, లీకైన డేటాను ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఫేస్‌బుక్ ఎటువంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తుంది. సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ హడ్సన్ రాక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఈ డేటా లీకైనట్లు మరోసారి కనుగొన్నారు. ఫేస్‌బుక్ యూజర్ల డేటాతో చెలగాటం ఆడుతుంది అని అలోన్ గాల్ పేర్కొన్నారు.

ఇంత మొత్తంలో లీకైనా డేటాను హ్యాకర్లు అమ్మడానికి ప్రయత్నిస్తారు అని ఆయన అన్నారు. “ఈ ప్రక్రియ కొన్నిసార్లు సంవత్సరాలు, కొన్నిసార్లు రోజులు పట్టవచ్చు” అని అన్నారు. మరికొందరు మాత్రం ఫేస్‌బుక్ కావాలనే యూజర్ల డేటాను లీక్ చేస్తుందని ఆరోపిస్తుందని అన్నారు. ఈ డేటా లీక్ బట్టి చూస్తే ఫేస్‌బుక్ తన యూజర్ల డేటా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో మనకు అర్ధం అవుతుంధి. లీకైన యూజర్లు వ్యక్తిగత సమాచారాన్ని పెద్ద మొత్తంలో ప్రకటనల కోసం అమ్మడానికి హ్యాకింగ్ ఫోరంలో ఈ సమాచారం ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ వార్తా చదివిన ప్రతి ఒక్కరూ వెంటనే మీ ఫేస్‌బుక్ సున్నితమైన సమాచారం, ఫోన్ నంబర్లు, పాస్ వర్డ్ మార్చుకుంటే మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here