జాగ్రత్త: ఈ లింక్ పై క్లిక్ చేసారో ఇక మీ పని అంతే!

0

సైబర్ సెక్యూరిటీ సంస్థ సొపోస్ మరోసారి ఫేస్‌బుక్ స్కామ్ పై యూజర్లను హెచ్చరించింది. సైబర్‌ నేరస్థులు కొత్త లింకుల ద్వారా మీ ఫోన్ లలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తునట్లు తెలిపింది. తాజాగా సైబర్‌ నేరస్థులు యూజర్ ఖాతా నుండి వీడియో లింకులు పంపుతున్నారని సొపోస్ పరిశోదకులు హెచ్చరిస్తున్నారు. ఈ లింకుల ద్వారా మీ ఖాతాతో పాటు బందువుల, స్నేహితుల ఖాతా కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్‌డేట్

మొదట సైబర్ నెరగాళ్లు మీకు మెసెంజర్ ద్వారా ఒక లింకును ‘Is it you in the video?’ పంపుతారు. దీంతో మీరు ఇది ఎంతో తెలుసుకోవాలనే ఉత్సాహంతో మీరు లింకును ఓపెన్ చేస్తారు. దీంతో ఆ లింకు ద్వారా మీరు ఫేక్ ఫేస్‌బుక్ లాగిన్ పేజీకి వెళ్తారు. ఒకవేల మీరు కనుక మీ లాగిన్ వివరాలు సమర్పిస్తే ఇక పని అంతే? మీ డేటా మొత్తం సైబర్ నెరగాళ్ల చేతికి వెళ్లడంతో పాటు మీ పేరుతో బందువులకు, స్నేహితులకు ఈ లింకులు పంపుతారు. దీంతో వారు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే మీరు ఏ లింకులు వచ్చిన క్లిక్ చేయకుండా ఉండటం మంచిది.

నకిలీ లింకు గుర్తించడం ఎలా?

ప్రతి ఫేస్‌బుక్ పేజీకి HTTPS అనే సెక్యూరిటీ లింకుతో ప్రారంభం అవుతుంది. ఒకవేల ఏదైనా లింకు ఫేస్‌బుక్ పేరుతో వస్తే ముందు HTTPS ఉందో లేదో తనికి చేయండి. HTTPS అంటే (హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్) అని అర్ధం. దీని ద్వారా మీ డేటా ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇంకా మరింత రక్షణం కోసం చాలా టూల్స్ లభిస్తాయి. ఒకవేల మీ ఫేస్‌బుక్ హ్యాక్ అయితే వెంటనే మీరు మీ ఖాతా యొక్క పాస్ వర్డ్ మార్చండి. వారు ఎటువంటి ప్రతిచర్యలకు పాల్పడక ముందే మీరు పాస్ వర్డ్ మార్చడం మంచిది. పాస్ వర్డ్ కూడా వీలైనంత కఠినంగా ఎంచుకోవడం మంచిది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here