3 కోట్లకు యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్‌!

0

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన యూజర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్ల పైగా పోస్టులపై వేటు వేసింది. దేశీయంగా ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబందనల ప్రకారం.. ఈ చర్య తీసుకున్నట్టు తన తొలి నెలవారీ కంప్లయిన్స్‌ నివేదికలో వెల్లడించింది. మరో నివేదికను జూలై 15న ప్రచురిస్తామని, అందులో వినియోగదారుల ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలు ఉంటాయని పేర్కొంది. ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 – జూన్ 15 మధ్య 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్టు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

అలాగే 9 కేటగిరీలలో రెండు మిలియన్ల యూజర్ల పోస్టులపై ఫేస్‌బుక్‌ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ చర్యలు తీసుకుంది. ఇందులో స్పామ్(25 మిలియన్లు), హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్(2.5మిలియన్లు), వయోజన నగ్నత్వం, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్లు కంటెంట్ ఉన్నట్లు తెలిపింది. ఉగ్రవాదనికి సంబంధించి 1,06,000 పోస్ట్‌లు, విద్వేషపూరిత ప్రసంగాలపై 311,000, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ 118,000 పోస్ట్‌లున్నట్టు తెలిపింది. కొత్త కొత్త ఐటీ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు(5 మిలియన్లకు పైగావినియోగదారులతో) ప్రతి నెలా కంప్లయిన్స్‌ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here