ప్రీ-రిజిస్ట్రేషన్లతో దుమ్ము రేపుతున్న ఇండియన్ గేమ్ ఫౌజీ!

0

గేమింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్‌. పబ్‌జీకి దీటుగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫౌజీ(ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌) గేమ్ 72వ గణతంత్ర దినోత్సవ కానుకగా రేపు (జనవరి 26)‌ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రారంభానికి ముందే ఫౌజీ 4 మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో తన సత్తా చాటినట్లు ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పేర్కొన్నారు. ఈ గేమ్ మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్‌లకు మాత్రమే పరిమితం అయినప్పటికీ ఇంత తక్కువ కాలంలో ఈ రికార్డు సాధించడం విశేషం.(ఇంకా చదవండి: వాట్సాప్ కి పోటీగా అదిరిపోయే ఫీచర్స్ తీసుకొచ్చిన సిగ్నల్ యాప్)

ప్రసుతం తక్కువ బడ్జెట్ ఫోన్‌లకు సపోర్ట్ చేయనప్పటికీ.. త్వరలోనే మొబైల్ లైట్ యూజర్ల కోసం ఫౌజీ లైట్ వెర్షన్ తీసుకురానున్నట్లు విశాల్ గొండాల్ ప్రకటించారు. రాయల్ గేమ్ పబ్‌జీ మొబైల్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన వెంటనే 2020 సెప్టెంబర్‌లో ఫౌజీ గేమ్ ని తీసుకొస్తున్నట్లు ఎన్‌కోర్ గేమ్స్ ప్రకటించింది. ప్రారంభంలో 2020 అక్టోబర్ చివరి నాటికి ప్రారంభించాలని అనుకున్న ఈ గేమ్ అనేక కారణాల వల్ల కొన్నీ నెలల ఆలస్యం అయింది. ఈ గేమ్ మొదటి టీజర్ 2020 అక్టోబర్‌లో దసరా రోజున తీసుకొచ్చారు. గత నెలలో ఈ గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే కేవలం 24 గంటల్లో 1 మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లను చేసుకున్నట్లు ఎన్‌కోర్ గేమ్స్ ప్రకటించింది.

పబ్‌జీ, ఫౌజీ రెండు వేర్వేరు

చాలా మంది భారతీయ గేమర్స్ దీనిని పబ్‌జీ మొబైల్ కి ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు, ప్రస్తుతం భారతదేశంలో నిషేధించబడిన పబ్‌జీ మొబైల్‌తో పోల్చినప్పుడు ఫౌజీ చాలా భిన్నమైన గేమ్ అని ఎన్‌కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ గేమ్ ప్రధానంగా ఒక కథాంశంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ఫౌజీ ఒక యాక్షన్ గేమ్ మాత్రమే, పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ లాగా కాదు అని గొండాల్ తెలిపారు.(ఇంకా చదవండి: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ ఖాతా మరింత సురక్షితం)

ఇప్పటికే చెప్పినట్లుగా ఈ గేమ్ ప్రధానంగా ఒక కథాంశం ఆధారంగా సృష్టించబడింది. ఇందులో ఆయుధాలు, గేమింగ్ మోడ్‌లు చాలా తక్కువగా ఉంటాయి. మొదటి ఎపిసోడ్ లో గాల్వన్ వ్యాలీ చుట్టూ కథాంశం తిరుగుతుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. తరువాతి అప్డేట్ లో బాటిల్ రాయల్ మోడ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు విశాల్ గొండాల్ పేర్కొన్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here