రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి సంచలనాత్మక ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి సీజన్ కు రైతుల ఖాతాలో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమఅవుతున్నాయి. ప్రస్తుతం భూమీ విస్తీర్ణం విషయంలో ఎటువంటి నిబందన లేదు. అయితే, ప్రస్తుత రాష్ట్ర ఆర్దిక పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని 5 ఎకరాలకే పరిమితం చేసినా కూడా చిన్న, సన్నకారు రైతులకే లాభం కలుగుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) అంచనా వేసింది.
5 ఏకరాలకే ఇస్తే రూ.4,500 కోట్లు మిగులు
ఇలా చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,500 కోట్ల వరకు మిగులుతుందని ఎఫ్‌జీజీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌జీజీ వినతిపత్రం అందజేసింది. రైతుబంధు పథకం కింద ఉన్న మొత్తం రైతులలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నట్లు ఎఫ్‌జీజీ తెలిపింది. 2020 యాసంగి కాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 147.14 లక్షల ఎకరాలకు సంబంధించి 59.21 లక్షల పట్టాదారులకు రూ.7,357.02 కోట్లు రైతుబంధు సాయం అందించినట్లు తెలిపింది.

అదే ఐదు ఎకరాల లోపు ఉన్న 53.30 లక్షల మంది చిన్న, సన్నాకరు రైతులు 102.24లక్షల ఎకరాలు కలిగి ఉన్నారు. వీరికి ఎకరాకి రూ.5వేల చొప్పున ప్రతి సీజన్‌కి రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేసిన రూ.5,112 కోట్లు ఖర్చు కానుంది. అంటే రెండు సీజన్‌లు కలుపుకున్న రూ.10,224 కోట్లు ఖర్చు అవుతుంది. అదే ప్రస్తుతం రెండు సీజన్లు కలుపుకొని ఏడాదికి రూ. 14,714 ఖర్చు అవుతుంది. ఇలా ఏడాదికి దాదాపుగా సుమారు రూ.4,500 కోట్లు రాష్ట్ర ఖజానాకు మిగలనున్నట్లు పేర్కొంది.
అదే పది ఎకరాల లోపు ఉన్నరైతులు రాష్ట్రంలో 58.07 లక్షల మంది ఉన్నారు. వీరు దాదాపుగా 132.65 లక్షల ఎకరాలను కలిగి ఉన్నారు. పది ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రతి సీజన్‌కి రైతుబంధు సాయాన్ని అందజేస్తే రూ.6,632.74 కోట్లు ఖర్చు అవుతుంది. ఇలా ఏడాదికి రైతు బందు పథకం కింద మొత్తం రూ.13,264 కోట్లు ఖర్చు అవుతుంది. మరీ ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్నవారికే పీఎం కిసాన్ సమ్మాన్ నిది కింద ఏడాదికి రూ.6వేల ఆర్దిక సహాయాన్ని అందజేస్తుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.