ఫ్లిప్‌కార్ట్‌ “బిగ్ దివాళీ సేల్” ప్రారంభం

0

దసరా పండగ సీజన్‌ను పురస్కరించుకుని ఇటీవలే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో సేల్‌ నిర్వహించిన ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. మరో సేల్‌కు సిద్ధమైంది. దీపావళి పండుగ సందర్భంగా ‘బిగ్‌ దివాళి సేల్‌’ పేరిట సేల్ ప్రారంభించింది. అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 4 వరకు ఈ సేల్‌ నడుస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కు సేల్‌లో ముందుగా పాల్గొనే అవకాశం కల్పిస్తోంది.

మొత్తం ఏడు రోజుల పాటు నడిచే ఈ సేల్‌లో యాక్సిస్‌‌ బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు యూజర్లకు 10 శాతం మేర డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇతర బ్యాంకు కార్డులపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తుంది. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’లాగే ఈ సేల్‌లోనూ మొబైల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లు ఇవ్వనుంది. అన్నింటి కంటే హాట్ డీల్ అయిన రూ.54,990 విలువైన ఎల్‌జీ జీ8ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,990 ధరకే కొనొచ్చు. ముఖ్యంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌41, గెలాక్సీ ఎస్‌20+, గెలాక్సీ ఏ50ఎస్‌తో పాటు పోకో ఎం2, ఎం2 ప్రో, పోకో సీ3, ఒప్పో రెనో 2ఎఫ్‌, ఏ52, ఎఫ్‌15, రియల్‌మీ నార్జో 20 సిరీస్‌ ఫోన్లపై డిస్కౌంట్‌ అందించబోతోంది. అలాగే రూపాయికే మొబైల్‌ ప్రొటెక్షన్‌ అందించనుంది. దీంతో పాటు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులైన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, హెడ్‌ఫోన్స్‌, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్‌, వాషింగ్‌ మెషిన్లపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here