Flipkart Big Diwali Sale 2021: మీరు కొత్తగా మొబైల్ కానీ ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్నారా? అయితే, రెండూ రోజుల ఆగండి. అక్టోబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ సేల్’ పేరుతో కొత్త సేల్ తీసుకొచ్చింది. ఈ దివాళీ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై 80శాతం, 70శాతం డిస్కౌంట్‌లో అందిస్తుంది. వీటితో పాటు పలు బ్యాంకుల డెబిట్ కార్డ్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా తెలిపింది. ఈ ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్-2021 అక్టోబర్ 17తో ప్రారంభమై అక్టోబర్ 23తో ముగియనుంది.(చదవండి: ఫెస్టివల్ బంపర్ ఆఫర్.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!)
70, 80శాతం డిస్కౌంట్లు
ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ప్రత్యేకంగా ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 16 12 రాత్రి నుంచి ప్రారంభం కానుంది. మిగిలిన కొనుగోలు దారులు అక్టోబర్ 17, 12 ఏఎమ్ నుంచి ప్రారంభం కానుంది. ఈ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 23 మధ్యాహ్నం 11.59గంటలకు ముగియనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ నుంచి ప్రొడక్ట్ కొనుగోలు చేసినా ఈఏఎంఐ సౌకర్యంతో పాటు 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సెస్ బ్యాక్ , ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగంతో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బిగ్ దివాళీ సేల్ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం డిస్కౌంట్స్ సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్‌పై 80శాతం డిస్కౌంట్స్, టీవీ, గృహోపకరణాలపై 75శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.