బ్యాంక్ ఖాతాకు ఆధార్ మరియు పాన్ కార్డ్ లింకు చివరి తేదీ ఎప్పుడంటే..?

0

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి 31 లోగా అన్ని ఖాతాలను సంబంధిత వినియోగదారుల ఆధార్ నంబర్లతో అనుసంధానించేలా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బ్యాంకులను కోరారు. ఇప్పటి వరకు చాలా వరకు బ్యాంకులకు ఆధార్ మరియు పాన్ కార్డు లింకు ఖాతాలను చాలా వరకు ఉన్నాయి.

“మార్చి 31, 2021 నాటికి, ప్రతి ఖాతాకు తప్పని సరిగా ఆధార్ మరియు పాన్ లింకు చేయాలని” అని సీతారామన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) యొక్క 73 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. బ్యాంకులు నగదు చెల్లింపులను ప్రోత్సహించవద్దని మరియు నగదు రహిత(డిజిటల్) చెల్లింపులను ప్రోత్సహించాలని మరియు యుపిఐ చేత జరిపే అనేక చెల్లింపులను ప్రోత్సహించాలని ఆమె అన్నారు. “యుపిఐ అనేది అన్నీ బ్యాంకులలో ఒక సాధారణ పరిభాష పదంగా ఉండాలి” అని అన్నారు. బ్యాంకులు రుపే కార్డులను ప్రోత్సహించాలని కోరారు. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ చర్చలు తప్పవని ఆమె అన్నారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here