డెబిట్‌/క్రెడిట్‌ కార్డు లాంటి “ఆధార్ కార్డు” కోసం.. ఇలా అప్లై చేసుకోండి!

0

ఆధార్‌ కార్డు ప్రతి పౌరుడు తప్పక కలిగి ఉండాల్సింది. ఇది విద్య, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలలో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయానికి అవసరం. ఈ జీవితంలో అన్నింటికీ అవసరమైన  ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇది డెబిట్‌/క్రెడిట్‌ కార్డు లాగా మన పాకెట్ లో కూడా ఇమిడిపోయేంత చిన్నగా ఉంది, అయితే ఈ పాలి వినైల్‌ క్లోరైడ్‌(పీవీసీ)తో తయారు చేసే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు. ఇలాంటి కార్డు కావాలని అనుకునే వారు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ధరఖాస్తు చేసుకుంటే మనకు పది రోజుల్లో స్పీడ్‌ పోస్టు ద్వారా వస్తుంది.(చదవండి: మీ ఫోన్ గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన కరోనా ఫీచర్ ని గమనించారా!)

దరఖాస్తు విదానం:

  • పీవీసీ ఆధార్ కార్డు అప్లయ్ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి My Aadhar ని క్లిక్ చేయండి.
  • గెట్ ఆధార్ అనే చోట మీకు Order – Aadhar PVC Card  అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చేయాలి.
  • తర్వాత క్యాప్చా కోడ్, ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. ఆ తర్వాత వచ్చిన ఓటీపీని కూడా నమోదు చేయాలి.
  • ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌తో డబ్బులు చెల్లించాలి.
  • పేమెంట్ పేజీలో మనీ(రూ.50) పే చేయండి. ఆ తర్వాత మీకు వచ్చే ఎస్‌ఆర్ఎన్ నెంబర్ సేవ్ చేసుకోండి.
  • ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ లోని అడ్రస్ కు 10 రోజుల్లో కార్డు ఇంటికి వచ్చేస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here