డిసెంబర్ 1 న జరగబోయే మునిసిపల్ ఎన్నికలలో ఓటు వేయాలనుకునే చాలా మంది హైదరాబాదీలలో మీరు ఒకరా. మీ వోటర్ స్లీప్ ఇంకా రాలేదా అయితే దిగులు పడకండి. గ్రేటర్ పరిధిలోని ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తున్నట్లు లోకేశ్ కుమార్ చెప్పారు. ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా ఓటరు స్లిప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 9235 పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయడానికి అర్హత ఉన్న 7404286 మంది ఓటర్లలో మీ పేరు ఉందో లేదా అనే దాని గురుంచి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(టిఎస్‌ఎస్‌ఇసి) తీసుకొచ్చిన ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. యాప్‌లో ‘డౌన్‌లోడ్ యువర్ ఓటర్ స్లిప్’ ఆప్షన్ క్లిక్ చేసి పేరు, వార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా ఓటరు స్లిప్, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా చూపిస్తుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు.(చదవండి: ఎయిర్‌టెల్ కొత్త టెక్నాలజీతో.. జియోకి ఎదురుదెబ్బ?)
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.