గతేడాది అత్యదిక ధరకు చేరుకుని మళ్లీ కిందకు దిగొచ్చిన బంగారం ధరలు.. మధ్యలో మళ్లీ కాస్త పెరిగినట్టు కనిపించింది. అయితే పెళ్లిళ్ల సీజన్ పూర్తి కావాడమో లేదా బిట్ కాయిన్ ధరలు పెరగడం వంటి అంతర్జాతీయ పరిణామాల వల్లో తెలియదు కానీ.. మళ్లీ పుత్తడి ధర దిగొస్తోంది. దీంతో బంగారం ధర ఎంతవరకు పడిపోతుందనే చర్చ మొదలైంది. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గి ధర ₹47,340కు పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 క్షీణించి ₹43,390కు చేరుకుంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు. కేజీ వెండి ధర ₹74,700గా ఉంది. బంగారం ధరలు ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం ₹43,390గా ఉంది. అంటే 6 నెలల్లో రూ.8,280 తగ్గింది పసిడి ధర.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.