Gold Price: కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) మొదలవ్వడంతోనే బంగారం ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. అప్పటి నుంచి బంగారం ధర పెరుగుతూనే వస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మే 23 వరకు నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,000 పెరగగా.. పెట్టుబడి పెట్టడానికి వాడే 24 క్యారెట్ల బంగారం ధర రూ.4,310 పెరిగింది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది దేశంలో కరోనా కేసులు గత నెల నుంచి విపరీతంగా పెరగడంతో అనేక రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధించాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టె పెట్టుబడిదారులు అందులో ఇన్వెస్ట్ చేయకుండా? స్వల్ప కాలానికి బంగారం మీద పెట్టుబడి పెట్టారు.
అలాగే, ఈ రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఉండటంతో ప్రజలు బంగారం కొనుగోలు చేశారు. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములు రూ.45,600గా ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములు రూ.49,750గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అంతటా ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక వెండి ధరలు గత పది రోజుల్లో 4 సార్లు పెరిగితే, 5 సార్లు తగ్గింది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.71,280గా ఉంది. ఏప్రిల్ 1 నుంచి రూ.8,000పైగా పెరిగింది.
బంగారం ధరలు ఇప్పటికే రూ.50వేలకు చేరువ అయ్యింది. అలాగే, ఇకపై ఇంత ఎక్కువగా ధరలు పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. రూపాయితో పోల్చితే డాలర్ విలువ తగ్గుతూ ఉంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై గతంలో కంటే తక్కువే చెల్లించేందుకు వీలవుతోంది. అలాగే, ఇండియాలో కరోనా క్రమంగా తగ్గుతోంది కాబట్టి దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. అందువల్ల పెట్టుబడుదారులు స్టాక్ మార్కెట్లవైపు వారి నిధులను మళ్లించే అవకాశాలు ఉన్నాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.