అడ్వెంచర్ ప్రియులకు గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి గోప్రో హీరో 9 బ్లాక్ విడదల

0

మోటో వ్లాగర్స్, అడ్వెంచర్ లవర్స్, నేచుర్ లవర్స్, సినిమా లవర్స్ కోసం గోప్రో సంస్థ సరికొత్త ఫ్లాగ్ షిప్ కెమెరాను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. గోప్రో హీరో 9 బ్లాక్ పేరుతో ఈ కెమెరాను  లాంచ్ చేసింది. ఇప్పటికీ హీరో సిరీస్ లో విడుదలైన 7, 8 మోడల్ కామెరాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. వాటికి కొనసాగింపుగా విడుదలైన ఈ కెమెరాలో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. దీని యొక్క ఫీచర్స్ అనేవి ఈ క్రింది విదంగా ఉన్నాయి.(చదవండి: మనకు యూట్యూబ్ 1000 వ్యూస్ కి ఎంత చెల్లిస్తుంది?)

గోప్రో హీరో 9 బ్లాక్ ఫీచర్స్:

దీని యొక్క ధర వచ్చేసి 49,500గా ఉంది, అక్టోబర్ చివరి నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో మనకు 23.6 మెగా పిక్సల్ సెన్సర్ ఉంది.. దీని వల్ల మనం 30 fps(frame per second)లో 5కే వరకు వీడియోని రికార్డు చేయవచ్చు. 60 fpsతో 4k లో రికార్డు చేయవచ్చు. 20 మెగా పిక్సల్ తో ఫోటోలు కూడా తీసుకోవచ్చు. తొలిసారిగా దీనిలో రెండు టచ్ స్క్రీన్ లు అందిస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీ వీడియోల కోసం కలర్ ఎల్ సీ డీ డిస్ప్లే అందిస్తున్నారు. దీనిలో మనకు 1720 ఏంఏహెచ్ బ్యాటరీ ఉంది.. ఇది మునుపటి మోడల్ హీరో 8 బ్యాటరీ కంటే 30 శాతం ఎక్కువ. ఇందులో వైఫై, బ్లూటూత్, జిపిఎస్ కనెక్టివిటీతో పాటు హైపర్ స్మూత్ 3.0, టైంవ్రాప్ 3.0 వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ద్వారా మనం మంచి నిలకడమైన మరియు స్లో మోషన్ వీడియోలు తీసుకోవచ్చు. 33 అడుగుల లోతులో కూడా వాడుకునేలా వాటర్ రెసిస్టెంట్ ప్రూఫ్ తో దీన్ని తయారు చేశారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here