గూగుల్ మీట్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ లు తీసుకోస్తూ వీడియో కాలింగ్ మార్కెట్ లో పోటీదారునిగా నిలవడానికి ప్రయత్నిస్తుంది. COVID-19 మహమ్మారి ప్రారంభంలో ప్రీమియం ఫీచర్స్ ను ఉచితంగా అందజేసిన తర్వాత కూడా గూగుల్ ఇప్పుడు Gmail ఖాతా వినియోగదారుల కోసం వచ్చే ఏడాది మార్చి వరకు ఉచిత, అపరిమిత మీట్ కాల్‌లను అందజేయనుంది.
గూగుల్ మీట్ సాదారణ వినియోగదారుల కోసం గత ఏప్రిల్‌లో గూగుల్ ఖాతా ఉన్న వారికి Meet యాప్ ద్వారా 100 మందితో ఉచితంగా సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి కాలపరిమితి లేని అవకాశాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు కల్పించింది. అయితే ఆ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ కాలపరిమితి తర్వాత సమావేశాలు నిర్ణయించుకునేదుకు సమయం 60 నిమిషాలకు కట్టుబడుతుందని వార్తల్లో వచ్చాయి. దీంతో మరోసారి యూజర్లకు గడువును పొడిగిస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. పాలసీ మార్పుకు ముందు గూగుల్ ప్రతినిది సమీర్ ప్రదాన్ మాట్లాడుతూ ఉచిత Gmail వినియోగదారుల కోసం అపరిమిత మీట్ కాల్స్ ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగిస్తున్నామని చెప్పారు. గూగుల్ మీట్ లో ఉన్నా పరిమితులను కూడా తొలగిస్తున్నట్లు తెలిపింది.(చదవండి: మార్కెట్ లోకి షియోమి కొత్త స్మార్ట్ ఉత్పత్తులు)
అలాగే, తాజాగా గూగుల్ మీట్ వినియోగ దారులు ఎదురుచూస్తున్నా కీలక ఆప్షన్ ని తీసుకొచ్చింది. మనం బయట కానీ లేదా ఇంట్లో కానీ గూగుల్ మీట్ లో మాట్లాడుతున్నపుడు మనకు వివిద రకాలు నాయిస్ కూడా రికార్డు అవుతుంది. ఇలా నాయిస్ రికార్డ్ అవ్వడం వల్ల ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని నివారించడం కోసం గూగుల్ noise cancelation సదుపాయం ప్రవేశపెట్టారు. అది చాలా శక్తివంతంగా పనిచేస్తోంది. చివరకు ఫ్యాన్ సౌండ్లు, బయట రోడ్ మీద అరిచే కుక్కల శబ్ధాలు వంటి వాటిని కూడా అది ఫిల్టర్ చేయగలుగుతోంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.