ప్రైవేట్ టీచర్లకు, రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

0

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని ఆదుకునేందుకు మరోసారి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా కొందరికి ఉపాధి లేకుండా పోయింది. మరికొందరికి పని ఉన్నా కూడా కరోనా భయంతో బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం కోటా పెంచాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్న ఐదు కిలోల రేషన్ బియ్యంతో కలిపి ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది.

జూన్‌ నెలలో కూడా ఇంతే మొత్తంలో పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 82.50 లక్షల రేషన్‌ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే కరోనా మహమ్మరి కారణంగా ఉద్యోగాలు పోయి భాదపడుతున్న లక్ష ఇరవై వేల మంది(1,20,000) ప్రైవేట్ టీచర్లకు, సిబ్బందికి నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం కోసం వారి వారి జిల్లాలో కలెక్టర్ల దగ్గర ధరఖాస్తు పెట్టుకోవాలని ఆదేశించింది.(ఇంకా చదవండి: ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకపోతే ఇలా పిర్యాదు చేయండి?)

ధరఖాస్తు చేసుకున్న 2 లక్షల మందిలో అర్హులైన 1,20,000 మందికి మాత్రమే ప్రభుత్వం సాయం అందుతుంది. ఈ నేపథ్యంలో మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేట్ టీచర్లకు, సిబ్బందికి కూడా రూ.2వేలను, 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం (మే 9న) ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here