Ration Card Holders: తెలంగాణలో రోజు రోజుకి కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ మహమ్మారి కారణంగా అనేక మంది మృత్యువాత కూడా పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు లాక్‌డౌన్ విదిస్తుందో అని తెలియక చాలా మంది పెద ప్రజలు మళ్లీ స్వంత ఊళ్లకు పయనమయ్యారు. చాలామందికి పనులు దొరకక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.(ఇది కూడా చదవండి: ట్రెండింగ్: మీ దగ్గర ఈ పాత కాలం నాణెం ఉంటే లక్షాధికారులే!)
రేషన్ కార్డు ఉన్నవారందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కష్టకాలంలో ఆదుకునేందుకు మరోసారి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పనిలేక ఇబ్బంది పడుతున్న పెద ప్రజలకు అందిస్తున్న రేషన్ కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యంతో కలిపి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని మే నెలలో ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను ఇప్పుడే విడుదల చేసింది. జూన్ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. రాష్ట్రలో 82.50 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను పంపిణీ చేస్తుంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.