పెను ప్రమాదంలో 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా

0

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా గూగుల్ కి చెందిన క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. దీంతో పాటు ప్రతి కంప్యూటరు, ల్యాప్టాప్ పరికరాలలో కూడా కచ్చితంగా ఈ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా ఈ బ్రౌజర్ వాడుతున్న వారిలో 200 కోట్ల మంది యూజర్ల డేటా పెను ప్రమాదంలో ఉన్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 200 కోట్ల మంది వాడుతున్న ఈ గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల కనుగొన్నారు.

ఈ బగ్ ద్వారా హ్యాకర్లు రిమోట్ గా బగ్ కోడ్ ను మీ మొబైలో ప్రవేశ పెట్టడానికి వీలుగా అనుమతించే ఒక పెద్ద భద్రతా లోపాన్ని కనుగొన్నట్లు గూగుల్ పేర్కొంది. కొత్తగా గుర్తించిన ఈ బగ్ ఇప్పటికి వినియోగంలో ఉన్నట్లు గూగుల్ తన బ్లాగులో వెల్లడించింది. అందుకే వెంటనే పాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న కస్టమర్లు వెంటనే బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. ఒకవేల పాత క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేయకపోతే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేయడంతో పాటు భద్రతా లోపం కారణంగా మీ డేటాను ఆన్లైన్ లో బహిర్గతం చేసే ప్రమాదం ఉంది. హ్యాకర్లు ఇలా హ్యాక్ చేసిన డేటాను మిలియన్ డాలర్లకు డార్క్ వెబ్ లో విక్రయిస్తారు. పాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ లను ఉపయోగిస్తున్న క్రోమ్ యూజర్లు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కచ్చితంగా మీ గూగుల్ క్రోమ్ వెర్షన్ 91.0.4472.164పైన ఉండాలని సంస్థ పేర్కొంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here