“లాంచ్ నైట్ ఇన్” కార్యక్రమంలో గూగుల్ సంస్థ గూగుల్ పిక్సెల్ 5 5జి మరియు పిక్సెల్ 4A 5జి మొబైల్ లను అధికారికంగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. పిక్సెల్ 5 లాంచ్ ఈవెంట్‌లో గూగుల్ టీవీ, నెస్ట్ ఆడియో స్పీకర్లతో కొత్త క్రోమ్‌కాస్ట్‌ను కంపెనీ ఆవిష్కరించింది. గూగుల్ పిక్సెల్ 5 ధర 8 జిబి + 128 జిబి వేరియంట్ కోసం 699 డాలర్లు (సుమారు రూ. 51,400)గా నిర్ణయించబడింది. పిక్సెల్ 5 జస్ట్ బ్లాక్ మరియు సోర్టా సేజ్.రంగులలో లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 5, 4A 5G మొబైల్ లు యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, తైవాన్ మరియు ఆస్ట్రేలియా దేశలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ 4A 5జి 6 జిబి + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు ధర 499 డాలర్లు (సుమారు రూ. 36,700). ఇది “జస్ట్ బ్లాక్” రంగులో మాత్రమే వస్తుంది.(చదవండి: LRS 2020 కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)
గూగుల్ పిక్సెల్ 5 5జి ఫీచర్స్
గూగుల్ పిక్సెల్ 5 6 అంగుళాల 90 హెర్ట్జ్ ఓఎల్‌ఇడి డిస్‌ప్లేను 19.5: 9 నిష్పత్తిలో కలిగి ఉంది. స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తో వస్తుంది. పిక్సెల్ 5 8 ఎంపి పంచ్-హోల్ ఫ్రంట్ కెమెరా ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రధానంగా కెమెరా విషయంలో చాలా ప్రసిద్ది చెందాయి. పిక్సెల్ 5 కెమెరా మాడ్యూల్‌లో 12.2MP ప్రైమరీ వైడ్ లెన్స్‌తో డ్యూయల్ లెన్స్ సెటప్ మరియు 16MP f / 2.2, 107-డిగ్రీల FOV అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ 4K 60FPS మరియు 1080p 240FPS వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

నైట్ సైట్ ఫర్ పోర్ట్రెయిట్ మోడ్, పోర్ట్రెయిట్ లైట్ వంటి కొన్ని కెమెరా ఫీచర్లను గూగుల్ జతచేసింది. పిక్సెల్ 5 స్పెసిఫికేషన్లలో 5జి కనెక్టివిటీ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్, 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి మెమరీతో పాటు, రివర్స్-పవర్ సామర్థ్యంతో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. పిక్సెల్ 5 5 జిలో ఆండ్రాయిడ్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో అమర్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
గూగుల్ పిక్సెల్ 4A 5జి స్పెసిఫికేషన్లు
గూగుల్ పిక్సెల్ 4A 5 జిలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు 19.5: 9 నిష్పత్తిలో 6.2-అంగుళాల పూర్తి HD + OLED డిస్ప్లే ఉంది. స్క్రీన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ మరియు 8 ఎంపి ఫ్రంట్ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉన్నాయి. పిక్సెల్ 5లో 5 జి కనెక్టివిటీ కోసం వాడే ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జిని పిక్సెల్ 4A 5జి లో వాడుతున్నారు. ప్రాసెసర్ 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి యుఎఫ్ఎస్ 2.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. పిక్సెల్ 4A 5 జి కెమెరా సెటప్‌లో 12.2 ఎంపి ప్రైమరీ సెన్సార్ మరియు వెనుకవైపు 16 ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. పిక్సెల్ 4A లో 18W ఫాస్ట్ ఛార్జింగ్, 3,800 mAh బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో అమర్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

గమనిక: పిక్సెల్ 4A 5జి, పిక్సెల్ 5 5జి మొబైల్ ఫోన్ లు భారతదేశంలో లాంచ్ అవ్వడం లేదు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.