ఆన్ లైన్ క్లాసుల కోసం సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన గూగుల్ మీట్

0

కరోనా ప్రభావంతో ఆన్లైన్ వినియోగం భాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే విద్యార్దుల క్లాస్ నుండి ఆఫీసు సమావేశాల కొరకు అన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. అయితే, వీటికోసం ఆన్ లైన్ లో చాలా రకాల యాప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా జూమ్, గూగుల్ మీట్ అనేవి ప్రతి ఒక్కరు వాడుతున్నారు వారి అవసరాల కోసం. గూగుల్ మీట్ ద్వారా 100 మందితో సమావేశం నిర్వహించుకోవచ్చు. అలానే ఒకే సారి 49 మందిని చూడొచ్చు. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ మీట్ లో ఫీచర్‌ ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సరికొత్తగా “బ్రేక్‌అవుట్ రూమ్ ఫీచర్”‌ను విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పేటప్పుడు కమ్యూనికేషన్ లో ఇబ్బంది లేకుండా ఉండటానికి విద్యార్థులను గ్రూపులుగా విభిజించవచ్చు. అలానే ఒకే కాల్‌లో పాల్గొనే విద్యార్థులను 100 గ్రూపులుగా విభజించుకోవచ్చు.

ఇందులో సమావేశం ప్రారంభంలో ముందుగానే గూగుల్ కొంత మందిని కొన్ని గ్రూపులుగా విభజిస్తుంది. తర్వాత నిర్వాహకులు తమకు నచ్చిన వారిని ఆ గ్రూపులలో యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ జీ సూట్ ఎంటర్‌ప్రైజ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర ప్లాట్‌ఫామ్‌లకు అందుబాటులోకి రానుంది అని తెలిపింది. అలానే రాబోయే రోజుల్లో ఇందులో టైమర్‌(Timer), సహాయం కోరడం (Ask For Help) వంటి ఆప్షన్స్‌ని తీసురానున్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటికే గూగుల్ మీట్ యాప్‌ను ఆన్‌లైన్‌ క్లాసులు, సమావేశాలు నిర్వహించేందుకు మరింత సమర్థంగా మారుస్తూ డిజిటల్‌ వైట్ బోర్డ్‌, అటెండెన్స్‌ షీట్, క్వశ్చన్‌&ఆన్సర్‌, పోలింగ్ వంటి ఫీచర్స్‌ని తీసుకొచ్చింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here