ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ సాధనమైన గూగుల్ మీట్ సేవలను ప్రారంభించింది. అయితే ఈ సేవలను గూగుల్ ఖాతా ఉన్నా ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందిస్తామని తెలిపింది. కానీ, గూగుల్ మీట్ ఇప్పుడు దాని ఉచిత వినియోగదారులపై కాలపరిమితిని విధించబోతోంది. సెప్టెంబర్ 30 నుండి గూగుల్ మీట్ అన్ని ఉచిత సమావేశాలను 60 నిమిషాలకు పరిమితం చేస్తుంది. ఇది ఏమి మనకు నిజంగా ఆశ్చర్యం కలిగించదు, ఎందుకంటే ఏప్రిల్‌లో ఉచిత మీట్ కాల్‌లకు సంబంధించి గూగుల్ చేసిన ప్రకటనలో దీని గురుంచి ప్రస్తావించారు. సాంకేతిక బాషలో చెప్పాలంటే, ఈ కాల పరిమితి ఫీచర్ అనేది ముంది నుండి అమలులో ఉంది, కానీ దానిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రాలేదు.(చదవండి: ఆ 17 యాప్స్ ను ప్లే స్టోర్ నుండి తొలగించిన గూగుల్)
గూగుల్ మీట్ యొక్క కాలపరిమితికి సంబందించిన సమాచారం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. బహుశా ఇది జూమ్ లాగా పనిచేసే అవకాశం ఉండవచ్చు. ఈ 60 నిమిషాల కాల పరిమితి ముగిసిన తర్వాత, మనం మరొక మీటింగ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉండవచ్చు. దాని తర్వాత ఇలా మనకు అవసరం ఉన్నంత వరకు చేసుకోవచ్చు. ఈ మహమ్మారి కాలంలో గూగుల్ మీట్ అనేది ఈ నిబందన తీసుకురావడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ, జూమ్ లోని 40 నిమిషాల కాలపరిమితితో పోలిస్తే గూగుల్ మీట్ 60 నిమిషాల కాల పరిమితి మంచి విషయం. జూమ్ తో పోలిస్తే సాంకేతికంగా గూగుల్ మీట్ ఉన్నతమైన ఎంపికగా మిగిలిపోతుంది.
Source: ది వెర్జ్
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.