గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్

0

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ విషయంలో పరిమితిని విధించబోతోంది. ఎన్‌పీసీఐ రూల్స్ ప్రకారం మొత్తం యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల్లో ఒక యాప్ ద్వారా గరిష్టంగా 30 శాతం వరకు మాత్రమే లావాదేవీల పరిమితిని విధిస్తోంది. ఉదాహరణకి ఒక రోజు మొత్తంలో ఒక కోటి లావాదేవీలు జరగాయి అనుకుంటే అందులో 30% మాత్రమే ఒక ఫోన్ పే లేదా గూగుల్ పే, ఇతర పేమెంట్స్ యాప్స్ ద్వారా జరగాలి. అంటే కోటి రూపాయల లావదేవిలో 30 లక్షలు మాత్రేమే జరగాలి అన్నమాట. కానీ, పేమెంట్స్ యాప్ యూజర్ల మీద గణనీయమైన ప్రభావం పడనుందని టెక్ నిపుణులు చెపుతున్నారు. ఈ నిబందన ద్వారా యూపీఐ పేమెంట్స్ యొక్క వాతావరణాన్ని కాపాడటంతో పాటు ఒకే యూపీఐ యాప్ మార్కెట్ లీడర్‌గా మారకుండా అడ్డుకోవడం దీని యొక్క ఉద్దేశ్యం. ఈ కొత్త నిబందన 2021 జనవరి 1న అమలులోకి రానుంది.

భారతదేశంలో వాట్సాప్ చెల్లింపులను ప్రారంభించడానికి ఎన్‌పిసిఐ ఎట్టకేలకు ఫేస్‌బుక్ అనుమతి ఇవ్వడంతో కొత్త నిబంధనలు వచ్చాయి.అయితే, ఈ యూపీఐ సేవను 20 మిలియన్ల వినియోగదారులకు పరిమితం చేసింది. ఇది సుదీర్ఘ ఆలస్యం తర్వాత ఆమోదం తెలిపినందున ఫేస్‌బుక్ సంస్థకు కొంచెం ఉపశమనం లభించినట్లయింది. 400 మిలియన్లకు పైగా వినియోగదారుల కలిగి ఉన్నందున వాట్సప్ అతిపెద్ద మార్కెట్ లీడర్‌గా మారకుండా అడుకుంది ఈ నిబందన. వాట్సాప్ మరియు యూపీఐ కలయిక డిజిటల్ ఎకానమీలో గ్రామీణ భాగస్వామ్యాన్ని పెంచుతుందని పేర్కొంటూ కాలిఫోర్నియా వేదికగా పనిచేస్తున్న ఫేస్ బుక్ సంస్థ ఈ ఆమోదాన్ని స్వాగతించింది.

డిజిటల్ చెల్లింపుల వ్యూహకర్త మరియు మాజీ ఎన్‌పిసిఐ ఎగ్జిక్యూటివ్ రామ్ రాస్తోగి మాట్లాడుతూ.. “కేవలం రెండు టెక్నాలజీ సర్వీసు ప్రొవైడర్లు (ఫోన్‌పే మరియు గూగుల్ పే) మార్కెట్ వాటాలో 80% స్వాధీనం చేసుకుంటే, అది దైహిక నష్టాలను కలిగిస్తుంది మరియు ఎన్‌పిసిఐ ఈ పరిమితిని పెట్టడానికి ప్రధాన కారణం ఒకే యూపీఐ యాప్ మార్కెట్ లీడర్‌గా మారకుండా అడ్డుకోవడం లక్ష్యం” అని రాస్తోగి చెప్పారు. ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తే మార్కెట్ లీడర్స్‌గా ఉన్న గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వారికి లిమిట్స్ విధించే అవకాశం ఉంది. అంటే రోజూ 5 లావాదేవీలు మాత్రమే అని లిమిట్ పెట్టొచ్చు. లేదా గంటకు ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలని రూల్ తీసుకురావొచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here