మీకు గూగుల్ ఖాతా ఉందా.. అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్. టెక్ దిగ్గజం గూగుల్ 1 జూన్ 2021 నుండి ఒక కొత్త పాలసీ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ పాలసీ ప్రకారం ఎవరి జీ-మెయిల్ అకౌంట్ అయితే వచ్చే ఏడాది నుండి 2 సంవత్సరాలు క్రియాశీలకంగా లేకుండా ఉంటుందో వారి అకౌంట్ తొలగించే అవకాశం ఉంది. అదేవిధంగా, వచ్చే ఏడాది జూన్ 1 నుండి గూగుల్ డాక్స్, షీట్లు, స్లైడ్‌లు, డ్రాయింగ్‌లు, ఫారమ్‌లు మరియు జామ్‌బోర్డ్ ఫైల్‌లు మరియు / లేదా గూగుల్ ఫోటోస్ మరింత మెరుగ్గా పనిచేయనున్నాయిని తెలిపింది. ఇదే కాకుండా మీ స్టోరేజీ పరిమితి రెండేళ్లు దాటినట్లయితే జీమెయిల్, డ్రైవ్, ఫోటోల్లో కంటెంట్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఏదేమైనా కంటెంట్ తొలగించడానికి ముందు మీకు చాలా సార్లు సమాచారం ఇస్తామని పేర్కొంది. అందువల్ల మీరు ఆలోపే స్పందించే అవకాశం ఉంటుందని గూగుల్ వెల్లడించింది. వినియోగదారులు ఈ సమస్యల నుండి బయట పడటానికి ఎల్లపుడూ Gmail, డ్రైవ్ లేదా ఫోటోలను ఓపెన్ చేస్తూ ఉండాలని సూచించింది.(చదవండి: భారత్‌లోకి త్వరలో రాబోతున్న షార్ట్ వీడియో యాప్)
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.