కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు లాభం!

0
Money Stock

స్టాక్ మార్కెట్‌ ఇది పెట్టుబడిదారులకు ఒక కలల ప్రపంచం. ఇందులో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఒక్క ఏడాదిలో మారిపోతాయి. ఒక్కోసారి తమ తోటి వారు గుర్తించని స్థాయికి వెళ్తారు. అయితే, ఇందులో ఎంత లాభం వస్తుందో, అంతే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో అందరినీ అదృష్టం ఊరికే వరించదు! వారు తీసుకునే రిస్క్ బట్టి అంతే స్థాయిలో రిటర్న్ వస్తుంది. కొన్ని నెలల కాలంలోనే లక్షాధికారిని కోట్లాధిపతిని చేయగల సత్తా ఒక్క షేర్ మార్కెట్‌కే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు, ఈ విషయం మరోసారి నిరూపితమైంది.

గడిచిన 8 నెలల్లోనే కొన్ని చిన్న కంపెనీల షేర్లు రూ.1 లక్ష పెట్టుబడికి ఏకంగా రూ.80 లక్షల లాభం సంపాదించి పెట్టాయి. బంగారు గనీలా మారిన గోపాల పాలీప్లాస్ట్(gopala polyplast ltd) షేర్లలో 8 నెలల క్రితం పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల పంట పండింది. ఈ క్రమంలో రూ.9 కంటే తక్కువ ధర ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్స్.. పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలను తెచ్చి పెట్టాయి. బెంచ్‌మార్క్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ ఈ ఏడాది మార్చి 26న రూ.8.26లుగా ఉన్న షేర్ ధర నేడు రూ.680గా ఉంది. అంటే కేవలం 8 నెలల కాలంలోనే 8000 శాతం పెరిగింది. దాంతో పెట్టుబడిదార్లకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది. ఈ ఏడాది మార్చి 26న లక్ష రూపాయలు విలువ గల ఈ స్టాక్స్ కొంటె ఇప్పుడు దాని విలువ రూ.80 లక్షలకు పైగా మారేది.

(చదవండి: మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here