Telangana Police Recruitment 2022: తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్(CM KCR) మరో శుభవార్త చెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్(Telangana Police Recruitment 2022) ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో రెండేళ్ల పాటు సడలింపు ఇస్తూ నిర్ణయం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల పాటు కరోనా కారణంగా నోటిఫికేషన్లు విడుదల కాలేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ యువతీ, యువకులకు వయోపరిమితిని పెంచాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
TS Police Jobs: ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Telangana State Level Police Recruitment Board) ఆ మేరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే, వయోపరిమితి సడలింపు వల్ల పోలీసు ఉద్యోగుల(Telangana Police Jobs)కు అర్హత గల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని కూడా మే 26వ తేదీ అర్ధ రాత్రి వరకు పొడగించింది. ఇంకా దరఖాస్తు చేసుకొని అభ్యర్ధులు ఆ లోగా అప్లై చేసుకోవాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) స్పష్టం చేసింది. ఆ తర్వాత గడువు తేదీని పొడగించారని కూడా స్పష్టంగా తెలిపింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మీ వివరాలను సమర్పిస్తే సరిపోతుందని, ఎలాంటి పత్రాలు ప్రస్తుతం అడగడం లేదని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (TSLPRB) ఛైర్మన్ తెలిపారు. ఎలా దరఖాస్తు చేసుకోవడానికి కూడా USER Guide, Model Applications Form పేరుతో రెండు ఆప్షన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. SC, ST అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజులో 50 తగ్గింపు ఇవ్వడం జరిగినది, మిగతా అభ్యర్ధులు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
