దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూజర్లకు ఉచితంగా 5జీబీ ఇచ్చేందుకు సిద్ధమైంది. టెలికాం దిగ్గజం కొత్త ఎయిర్‌టెల్ 4జీ కస్టమర్లకు 5 జీబీ ఉచిత డేటాను ఇస్తోంది. దీని కోసం వారు ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కొత్త 4జీ సిమ్‌ను కొనుగోలు చేసి ఉంటే లేదా 4జీ అప్‌గ్రేడ్ చేసి ఉంటే, మీరు మీ కొత్త మొబైల్ నంబర్‌తో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది.(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్ ఇదే)
ఎయిర్‌టెల్ 1 జీబీ కూపన్ల రూపంలో 5 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. ఇది టెలికామ్‌టాక్ ప్రకారం 72 గంటల్లో కొత్త 4జీ కస్టమర్ ఖాతాకు ఈ డేటా జమ అవుతుంది. ఉచిత 5జీబీ డేటాను పొందడానికి మీరు కొత్త మొబైల్ నంబర్‌ను యాక్టివేట్ చేసిన 30 రోజుల్లోపు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లో నమోదు చేసుకోవాలి. మీరు కూపన్‌లను స్వీకరించిన తర్వాత, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లోని “My Couponస్” విభాగాన్ని ఎంచుకోవడం ద్వారా వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. క్రెడిట్ అయిన రోజు నుండి 90 రోజుల్లో వినియోగదారులు ప్రతి 1 జిబి కూపన్‌ను రీడీమ్ చేసుకోవచ్చని సమాచారం. మీరు డేటాను రీడీమ్ చేసిన తర్వాత, ఈ ఉచిత డేటా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, మీరు ఇప్పటికే 4జీ ఎయిర్‌టెల్ యూజర్ అయితే, ఇంకా పేర్కొన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోతే, మీరు ఇంకా 5 జీబీ పొందలేకపోతే మీకు 2 జీబీ ఉచిత డేటా లభిస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.