Hero MotoCorp Vida Electric Scooter: హీరో మోటోకార్ప్‌ నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్

0
pawan-munjal-unveils-vida-brand
pawan-munjal-unveils-vida-brand

Hero MotoCorp Vida Electric Scooter: దేశీయ ఆటో మొబైల్‌ రంగంలో ప్రముఖ సంస్థ హీరో మోటోకార్ప్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వచ్చే నెలలో దేశీయ మార్కెట్లోకి తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్’ను లాంచ్ చేయడంతో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 7, 2022న విడా(Vida) బ్రాండ్‌ కింద తన తొలి హీరో మోటోకార్ప్‌ ఎలక్ట్రిక్ స్కూటర్(Hero Motocorp Electric Scooter) మోడల్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రవాణా రంగంలో సరికొత్త శకాన్ని నాంది పలుకుతూ అక్టోబర్‌ 7న రాజస్థాన్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తన డీలర్‌లు, పెట్టుబడిదారులు మరియు గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్‌లకు, స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్?)

దీంతో పరోక్షంగా ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో తన ప్రవేశాన్ని స్పష్టం చేసింది. మరో జైపూర్‌లో జరగబోతున్న I డీలర్లు, ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ పంపిణీదారులను పాల్గొనాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఈ సంవత్సరం మార్చిలో, హీరో మోటోకార్ప్ తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలతో సహా 10,000 మంది వ్యవస్థాపకులకు ESG సొల్యూషన్స్‌లో శిక్షణ ఇవ్వడానికి 100 మిలియన్ డాలర్లు సుమారు రూ. 760 కోట్ల గ్లోబల్ ఫండ్‌ను రైజ్ చేసింది.

జైపూర్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ఈ వాహనాన్ని రూపొందించినట్లు, విడా బ్రాండ్‌ కింద ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న ప్లాంటులో ఈ వాహనాల తయారీని చేపట్టవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు హీరో మోటోకార్ప్‌ ఎలక్ట్రిక్ స్కూటర్(Hero Motocorp Electric Scooter) ధర, స్పెసిఫికేషన్స్, రేంజ్ గురించి సమాచారం లేదు.

(ఇది కూడా చదవండి: అదిరిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్?)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here