కొత్తగా హోమ్​ లోన్ తీసుకునేవారు ముందు ఇవి తెలుసుకోండి?​

0
Home Loan EMI

గృహ రుణాల వడ్డీ రేట్లు నాలుగు దశాబ్ధాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అందుకే, మీ సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. అయితే, ఎంత రుణం తీసుకుంటే మీపై ఈఎంఐ భారం ఎంతమేరకు పడుతుంది అనేది ముందే పరిశీలించుకోవాలి. నెలవారీ ఈఎంఐను ప్రధానంగా రెండు అంశాలు ఆధారంగా నిర్ణయిస్తారు. మొదటిది వడ్డీ రేటు, రెండోది రుణ వ్యవధి. కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలి అనుకునే వారు ముందుగా మీ నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకునేందుకు చూసుకోవాలి. వీలైతే మీ అధాయంలో 50 శాతం లోపు ఉండే విధంగా చూసుకుంటే మంచిది.(ఇది కూడా చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట!)

తక్కువ ఎల్టీవీ రేషియో

మీరు తీసుకునే సమయంలో మీ ఆధాయం, మీ వయస్సు బట్టి ఈఏంఐ రుణాన్ని ఎంచుకోవాలి. గృహ రుణాలు తీసుకునేటప్పుడు తక్కువ ఎల్టీవీ రేషియో ఉండేటట్లు చూసుకుంటే మంచిది. గృహ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయానికి, మీరు తీసుకునే రుణానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ఎల్టీవీ రేషియో అంటారు. ఉదాహరణకు మీరు తీసుకున్న ఇల్లు ఖరీదు రూ.50 లక్షలు అనుకుంటే రూ.30 లక్షల లోపు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం మంచిది. సాధారణంగా, కొన్ని బ్యాంకులు ఇంటి మొత్తం విలువలో 80-85 శాతం వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని బ్యాంకులైతే 90 శాతం వరకు కూడా రుణాలు ఆఫర్ చేస్తాయి.

ఎక్కువ కాలపరిమితి

బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి కదా అని రుణాలు తీసుకుంటే కరోనా మహమ్మారి లాంటి సమయంలో మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎల్టీవీ రేషియో ఎక్కువగా ఉంటే ఆర్ధిక ఒత్తిడిలకు గురి కావాల్సి ఉంటుంది. ఎల్టీవీ రేషియో తక్కువగా ఉండటం వల్ల మీకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం లభించే అవకాశం ఉంటుంది. మీకు సాధ్యమైనంత వరకు సొంతంగా ఎక్కువ డబ్బు సమకూర్చుకునేందుకు ప్రయత్నించాలి. మీ డౌన్ పేమెంట్ ఎక్కువగా కట్టే విధంగా చూసుకోవాలి. కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారు ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం ద్వారా ఈఎంఐ భారాన్ని కొంత మేరకు తగ్గించుకోవచ్చు.

ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే ఈఎమ్ఐ భారం తగ్గుతుంది. ఇదే క్రమంలో వడ్డీ భారం పెరుగుతుందనే విషయం గమనించాలి. గృహరుణం కోసం ఏదైనా బ్యాంకును ఎంచుకునే ముందు ఆన్లైన్ లో వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను ఒకసారి పోల్చి చూసుకోండి. ఆయా బ్యాంకుల అధికారిక పోర్టల్ నుంచి ప్రస్తుత వడ్డీ రేట్లను సులభంగా తెలుసుకోవచ్చు. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీల గురించి పూర్తిగా ముందే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ చేసే ప్రధాన తప్పు ఇక్కడ జరుగుతుంది. తక్కువ వడ్డీకే గృహరుణం పొందేందుకు తగినంత పరిశోధన చేయడం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here