ఇంటి అవసరాల కోసం ఎంత ఇంటర్నెట్ వేగం అవసరం?

0

మనం ఇందుకు ముందు ఆర్టికల్ లో అసలు ఇంటర్నెట్ వేగం తక్కువ వస్తుంది అనే దాని గురుంచి తెలుసుకున్నాం. కానీ చాలా మంది మా ఇంటి అవసరాలకు ఎంత ఇంటర్ స్పీడ్ అవసరం అవుతుంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ గల కనెక్షన్ తీసుకుంటే పని విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఎక్కువ స్పీడ్ గల ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకుంటే కొంత డబ్బు వృదా అవుతుంది. అదే మన పనిని బట్టి ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.(ఇది చదవండి: సాదారణంగా ఇంటర్ నెట్ స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది?)

కొత్తగా కనెక్షన్ చాలా మంది ఒక విషయంలో కొంత అయోమయానికి లోనవుతారు. మీరు కొంత స్పీడ్ గల ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే మీకు అక్కడ 45/24 Mbps అని రాసి ఉంటుంది. దాని అర్ధం మీ ఇంటర్నెట్ కనెక్షన్ యొక్క డౌన్‌లోడ్ వేగం 45/Mbpsగా ఉంటే అప్‌లోడ్ వేగం 24Mbps అన్న మాట. కానీ ప్రస్తుతం చాలా నెట్వర్క్ లు ఒకే ఇంటర్నెట్ డౌన్‌లోడ్/అప్‌లోడ్ వేగాన్ని అందిస్తున్నాయి. మీ ఇంటర్నెట్ కనెక్షన్ వేగం ఎక్కువగా ఉంటే టెక్స్ట్, ఆడియో వీడియో ఫైల్‌లను ఎక్కువ వేగంతో డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు. మీ ఇంటర్నెట్ వేగం లైవ్ గా తెలుసుకోవాలంటే fast.com క్లిక్ చేయండి.

  • ప్రాథమిక ఇంటర్నెట్ వాడకం: 6 నుంచి 18Mbps
  • ఎస్ ‌డి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • ఎమ్‌పి 3 పాటలు డౌన్‌లోడ్ చేయవచ్చు
  • 2-3 పరికరాలను మాత్రమే కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
  • చిన్న ఎస్‌డి వీడియోలను మాత్రమే చూడవచ్చు
  • మోడరేట్ ఇంటర్నెట్ వాడకం: 25 నుంచి 30 Mbps
  • SD లేదా HD వీడియోలను లైవ్ లో చూడవచ్చు
  • ఆన్‌లైన్ గేమింగ్ అడుకోవచ్చు
  • ఒకేసారి ఎక్కువ మొత్తంలో పాటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • ఒకేసారి 3 నుంచి 5 పరికరాలను కనెక్ట్ చేయవచ్చు.
  • ఎటువంటి ఆటంకం లేకుండా ఆన్ లైన్ క్లాస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు
  • భారీ ఇంటర్నెట్ వినియోగం కోసం: 50 నుంచి 100
  • ఇది ఎక్కువగా బిజినెస్ చేస్తున్న వారికి ఉపయోగపడుతుంది
  • మీ ఇంట్లో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే వాడుకోవచ్చు.
  • ఆన్‌లైన్ గేమ్ లు లైవ్ స్ట్రీమింగ్ చేసుకొచ్చు
  • హై ప్రొఫెషనల్ పని కోసం వాడుకోవచ్చు.

మీరు ఆన్‌లైన్‌లో ఏమి చేయాలనుకుంటున్నారు, ఎంత మంది వ్యక్తులు/పరికరాలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తారో ముందుగా పరిశీలించండి. నేను మాత్రం ప్రస్తుతం వినియోగించే ఇంటర్ నెట్ వేగం వచ్చేసరికి 30 Mbpsగా ఉంది. భవిష్యత్ లో నా అవసరాల దృష్ట్యా నేను 100Mbps తీసుకునే అవకాశం ఉంది. నన్ను సలహామాత్రం 25 నుంచి 30 Mbps వేగం ఉండే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోమనే చెబుతాను. మీ, మీ ఇంటి అవసరాల బట్టి ఉత్తమమైన Mbps పరిధిని ఎంచుకోవడంతో పాటు మీ ప్రాంతంలో మంచి సేవలను అందించే ఇంటర్నెట్‌ కనెక్షన్ తీసుకోండి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవలు, సాంకేతిక పరిజ్ఞానంకు సంబందించిన తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here