Land Pahani: భూ పహాణీ, అడంగళ్‌/పహాణీ, ఖాస్రా పహాణీ అంటే ఏమిటి? వాటి కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

0
Agriculture Land Pahani

What is Adangal, Khasra Land Pahani in Telugu: మన రెండూ తెలుగు రాష్ట్రాలలో భూముల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఎలాంటి భూమిని ఏమంటారనేది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆసక్తితో కొందరు, వృత్తి రీత్యా తప్పనిసరిగా మరికొందరు వీటి వివరాలను తెలుసుకుంటుంటారు.

(ఇది కూడా చదవండి: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా?)

భూ రికార్డులను నిర్వహించడానికి చీఫ్ కంట్రోలింగ్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్‌ఎ) వ్యవస్థ ఉంటుంది. ప్రతి భూమికి సంబంధించిన డేటాను ఈ వ్యవస్థ భద్రపరుస్తుంది. భూమికి సంబంధించి అతి ముఖ్యమైనది భూ పహాణీ.

భూ పహాణీ అంటే ఏమిటి?

భూ పహాణీ అంటే భూమికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని భద్రపరిచే ఒక రికార్డు. దీనిని మనలో చాలా పేర్లతో పిలుస్తారు. అందులో ముఖ్యమైనది ఖాస్రా పహాణీ, సేత్వార్ పహాణీ, అడంగల్/పహాణీ, ROR అని పిలుస్తారు.

(ఇది కూడా చదవండి: ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో వాడే పదాల గురించి మీకు తెలుసా?)

అడంగళ్‌/పహాణీ అంటే ఏమిటి?

గ్రామంలో సాగు భూముల వివరాలను నమోదు చేసే రిజిస్టరు. దీనిని ఆంధ్ర ప్రాంతంలో అడంగళ్‌, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టరును గ్రామ లెక్క నెంబరు 3 అని కూడా అంటారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ-పహాణీలు జారీ చేస్తున్నారు. ఈ రిజిస్టరులో గ్రామంలోని అన్ని భూముల వివరాలను ప్రతి సంవత్సరం నమోదు చేస్తారు. ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి మీరు అడంగళ్‌/పహాణీ, ROR గురించి వివరాలను తెలుసుకోవచ్చు.

శాశ్వత భూ రికార్డులు

  • సేత్వార్(డైగ్లాట్),
  • ఖాస్రా పహాణీ,
  • టిప్పన్

సేత్వార్(డైగ్లాట్) అంటే ఏమిటి?

రెవెన్యూ గ్రామాల వారీగా మొదటిసారి భూ సర్వే నిర్వహించి సెటిల్‌మెంట్ కార్యకలాపాలు పూర్తి చేసి ప్రతి గ్రామంలో భూముల వివరాలను ఒక రికార్డు రూపంలో భద్ర పరిచారు. ఆ రికార్డును తెలంగాణలో సేత్వార్ అని, ఆంద్ర ప్రదేశ్’లో డైగ్లాట్ అని అంటారు. ఈ సర్వేను 1919 నుంచి 1930 వరకు చేశారు. ప్రస్తుతం అన్నీ రికార్డులకు మూలం ఈ రికార్డు.

(ఇది కూడా చదవండి: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా?)

అందుకే, ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు కోర్టులు మొదట సేత్వార్(డైగ్లాట్) రికార్డులు పరిశీలిస్తాయి. ఆ సేత్వార్(డైగ్లాట్) రికార్డులో అన్ని రకాల భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, అవి సర్కారు, ఇనాం భూములా, మాగాణియా, మెట్టా, వాటి వర్గీకరణ, శిస్తు, మొదలగు వివరాలుంటాయి. ఈ రిజిస్టర్ మిగతా గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూల స్తంభంలాంటింది.

ఖాస్రా పహాణీ అంటే ఏమిటి?

ఉమ్మడి కుటుంబాల్లో ఒకే వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ, తొలిసారిగా రైతు వారీగా భూమి పట్టా హక్కు కల్పించిన పహాణీ ఈ ఖాస్రా పహాణీ. దీనిని 1953-54లో ప్రవేశపెట్టగా, 1954-55 సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఖాస్రా పహాణీ వల్ల మొదటిసారిగా సర్వే నెంబర్’ను డివిజన్ చేయడం జరిగినది.

టిప్పన్(ఎఫ్‌ఎమ్‌బీ) అంటే ఏమిటి?

భూమి కొలతలకు ఉపయోగించే ఫీల్డ్ మెసర్‌మెంట్ బుక్ ఇది. సర్వే సెటిల్‌మెంట్ రికార్డులు తయారు చేసేటప్పుడు ప్రతి సర్వే నంబర్‌కు ఒక టిప్పన్ తయారు చేశారు. ప్రభుత్వ భూములకు టిప్పన్(ఎఫ్‌ఎమ్‌బీ) ఉండదు. క్షేత్ర సరిహద్దు రేఖలు, ఆధార రేఖ, అంతరలంబాల కొలతలు తెలిపే పుస్తకం (ఎఫ్‌ఎమ్‌బీ), క్షేత్రస్థాయి కొలతల స్కెచ్.

భూ పహాణీ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

మనలో చాలా మందికి భూ పహాణీ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై సరైన అవగాహన లేదు. పైన చెప్పినట్లు ఖాస్రా పహాణీ, సేత్వార్ పహాణీ అడంగల్/పహాణీ, ROR కోసం మనం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ

ప్రస్తుతం తెలంగాణలో 2020 తర్వాత సంబంధించిన భూ పహాణీలు మాత్రమే ధరణిలో లభిస్తున్నాయి. అంతకముందు సంబంధించిణ భూ పహాణీల కోసం మనం స్థానికి తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 2,000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కావాల్సిన భూ పహాణీల కోసం తహశీల్దార్ కార్యాలయంలో కేవలం ఒక అర్జీ పెట్టుకుంటే సరిపోతుంది.

ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 2,000 ఏడాది ముందుకు సంబంధించి భూ పహాణీ కావాలంటే కచ్చితంగా ఒక లాయర్ అఫిడవిట్ తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. మీరు సబ్-రిజిస్టర్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్

ప్రస్తుతం ఏపీలో కూడా 2000 సంవత్సరం నుంచి సంబంధించిన భూ పహాణీలు మాత్రమే మీ భూమి పోర్టల్’లో లభిస్తున్నాయి. అంతకముందు సంబంధించిణ భూ పహాణీల కోసం మనం స్థానికి తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

2,000 ఏడాది ముందుకు సంబంధించి భూ పహాణీ కావాలంటే కచ్చితంగా ఒక లాయర్ అఫిడవిట్ తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. మీరు సబ్-రిజిస్టర్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

భూమి పహాణీ ఎన్ని రోజుల్లో వస్తుంది?

భూమి పహాణీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక నెల రోజుల లోపు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది ఒక అంచనా మాత్రమే.. దీనికి ఎలాంటి కాలపరిమితి లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి.

భూ పహాణీ కోసం ఎంత చెల్లించాలి?

భూ పహాణీ పొందడం కోసం తహశీల్దార్ కార్యాలయంలో ఎలాంటి రుసుము/నగదు/డబ్బులు చెల్లించాల్సినా అవసరం లేదు. ఈ సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. అయితే, వీటి ప్రింట్ ఔట్ కోసం జిరాక్స్ కోసం మీ సేవలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here